Thursday, December 31, 2015

హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు..


మీకు 
హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.. 


Friday, December 25, 2015

Quiz


ఆరుగురు మిత్రులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. సరిగ్గా పన్నెండు గంటలకు కేకుని కోసి, ప్రతి ఒక్కరూ మిగతా ప్రతివారితో షేక్ హ్యాండ్ చేస్తూ, శుభాకాంక్షలు తెలియచేశారు. ఇప్పుడు ఇక్కడ జరిగిన షేక్ హ్యాండ్స్ మొత్తం ఎన్నో చెప్పుకోండి చూద్దాం..  
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

జవాబు : 


క్రిస్మస్ శుభాకాంక్షలు.


 క్రిస్మస్ శుభాకాంక్షలు. 

Tuesday, December 22, 2015

పొడుపు కథలు - 20


మెడ ఉంటుంది కానీ తల ఉండదు. 
చేతులు ఉంటాయి కానీ వ్రేళ్ళు ఉండవు.. 
ఏమిటది? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 

Saturday, December 19, 2015

పొడుపు కథలు - 19


గాజు పంజరంలో మిణుగురు పురుగు, 
రాత్రయితే జాగారం, తెల్లారితే నిద్ర. 
ఏమిటదీ? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 


Thursday, December 17, 2015

Featured Post వివరాలు

ఈమధ్యనే బ్లాగుల్లో బ్లాగర్ వారు సరిక్రొత్తగా Featured Post ( ఫీచర్డ్ పోస్ట్ ) అనే ఆప్షన్ ని ఇచ్చారు. ఇది కేవలం బ్లాగ్ స్పాట్ వారి బ్లాగుల్లో మాత్రమే వాడటానికి వీలవుతుంది. ఇది బ్లాగులు నిర్వహిస్తున్నవారికి చక్కని ఉపకరణం అనుకోవాలి. అది ఎలా అంటే - 
  1. బ్లాగుల్లోని పాత పోస్ట్స్ ని తమ బ్లాగుని చూసేవారికి తెలియజేసేందుకు 
  2. పాత పోస్ట్స్ ని పరిచయం చెయ్యటానికి 
  3. ఈ పోస్ట్ చాలా బాగుంటుంది 
  4. ఈ టపా చదివితే మీకు మరిన్ని విషయాలు  తెలుస్తాయి 
  5. వచ్చే పండగ గురించి నేను వ్రాసిన పోస్ట్ చదివితే మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి 
  6. ఈ పాత టపా ఈ బ్లాగుకే హైలెట్ పోస్ట్.. 
  7. ప్రస్తుత పరిస్థితి గురించి నేను ఏనాడో చెప్పిన వివరాలు ఈ పోస్ట్ లో ఉన్నాయి.. 
  8. నేను వెళ్ళిన క్రొత్త ప్రదేశపు పర్యటన తాలూకు అనుభూతులు ఈ పోస్ట్ లో చదవచ్చు.. 

.. .. ఇలా ఎన్నెన్నో రకాలుగా - మీ గత టపాల తాలూకు మాధుర్యాలని - క్రొత్తగా మీ బ్లాగ్ వీక్షకులకు రుచి చూపించవచ్చు. ఒకమాటలో చెప్పాలంటే - గత కాలపు అనుభూతుల ఫోటో ఆల్బమ్ ముందు పెట్టి, అవి ఫలానా టూర్ వెళ్ళినప్పటి ఫొటోస్ అనో, ఫలానా ఘటన మీద నేను వ్యక్తీకరించిన అభిప్రాయాలు... ఇలా మీ పాత పోస్ట్స్ ని మీ బ్లాగ్ వీక్షకులకి మళ్ళీ / తాజాగా రుచి చూపించవచ్చు. ఇలా చెయ్యటం వలన బాగున్నాయని ఆనుకున మీ గత పోస్ట్స్ ని చదువరులకి - చక్కగా, నూతనంగా పరిచయం చెయ్యొచ్చు. 

దీనివల్ల మనకేమి లాభం అనుకుంటున్నారా ? అయ్యో.. చాలానే ఉన్నాయండీ.. ఎలా అంటే అలా పరిమితకాలం వరకూ ఒక్కో పోస్ట్ ని ఎన్నుకొని, అలా చూపిస్తే - అక్కడ వచ్చిన నీలిరంగులో ఉన్న లింక్ ద్వారా ఆ పోస్ట్ ని నేరుగా చూస్తారు. బాగుంది అనుకుంటే మరిన్ని పోస్ట్స్ కి వెళతారు. లేదా మరో లింక్ కోసం / ఫీచర్డ్ పోస్ట్ కోసం ఎదురుచూస్తారు. అంటే ఒక పోస్ట్ కోసం వచ్చిన వారిని - ఈ ఆప్షన్ వల్ల మరో పోస్ట్ చదివిస్తాం అన్నమాట. దీనివల్ల మన బ్లాగ్ వీక్షకుల సంఖ్య పెరుగుతుంది. గూగుల్ ఆడ్ సెన్స్ గనక మన బ్లాగ్ కు ఉంటే ప్రకటనలూ పెరుగుతాయి. దానివల్ల ఆదాయమూ పెరుగుతుంది. ఇలా ఇన్ని లాభాలు ఉన్నాయని తెలుసుకున్నారు కదా.. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? పదా మరి..


ఫొటోస్ పెద్దగా కనిపించేందుకు ఫోటో మీద డబుల్ క్లిక్ చెయ్యండి. 

మీ బ్లాగ్ హోం పేజీ తెరిచి చూస్తే - ఇలా లేత నీలిరంగులో ఉన్న ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఆ నోటిఫికేషన్ చివరిలో ఎర్రని బాణం గుర్తు వద్ద ఉన్న Learn more ని నొక్కితే మీరు - మీ బ్లాగ్ పేజీ లే అవుట్ Lay out కి వెళతారు. లే అవుట్ అంటే - మీ బ్లాగ్ లోని ఆప్షన్స్ వాడితే మీ బ్లాగ్ ఎలా ఉంటుందో చూపే ఒక ప్లాన్ మాదిరిగా అనుకోవాలి. ఒకవేళ మీకు అలా నీలిరంగు డబ్బా లోని నోటిఫికేషన్ పొరబాటున తీసేసినా, రాకున్నా బాధపడాల్సిన అవసరం లేదు.. బ్లాగ్ హోం పేజీ ఓపెన్ చేసి, బ్లాగ్ లే అవుట్ కి వెళ్ళండి. 


ఎర్రని బాణం గుర్తు వద్ద ఉన్న learn more ని నొక్కితే ఈ క్రింది విధముగా మీ బ్లాగ్ లే అవుట్ పేజీ తెరచుకుంటుంది. 


మౌస్ చక్రాన్ని తిప్పితే - అదే పేజీకి క్రిందనకి చేరుతాం. అక్కడ కుడి ప్రక్కన ఉన్న Side bar లోని మొదటగా నీలిరంగులో ఉండే Add a Gadget ని నొక్కండి. ( క్రింది ఫోటోలో ఎరుపు రంగు దీర్ఘ వృత్తంలో చూపించినది ) 


అప్పుడు మీకు Add a Gadget టూల్స్ గల ఒక పేజీ తెరచుకుంటుంది. Basics లోని రెండవ టూల్ యే ఈ Featured post. మీరు మీ బ్లాగులోని మీకు నచ్చిన ఏదైనా పోస్ట్ ని హైలైట్ చెయ్యాలనుకుంటున్నారో ఆ పోస్ట్ ని చూపెట్టుటకు ఈ గాడ్జెట్ ని మీ బ్లాగ్ కి జత చెయ్యాలి. అంటే ఆ గాడ్జెట్ కి కుడివైపున ఉన్న + గుర్తుని నొక్కాలి. క్రింద ఫోటోలో ఎర్రని బాణం గుర్తు వద్ద చూపెట్టబడింది. 


అలా ఆ + గుర్తుని నొక్కగానే మీకు ఈ క్రింది ఫోటోలో మాదిరిగా వివిధ ఆప్షన్స్ గల ఒక పేజీ మీకు కనిపిస్తుంది. ( క్రింది ఫోటోలో చూడండి ) 

ఇందులో 1 వద్ద - Gadget Title వద్ద Featured Post అని డిఫాల్ట్ గా ఉంటుంది. దీన్ని మీరు - మళ్ళీ చూడండి / ఈ పోస్ట్ చదివి పెట్టండి / See this అనో.. మీకు నచ్చిన టైటిల్ పెట్టి మార్చుకోవచ్చు.. లేదా అలాగే ఫీచర్డ్ పోస్ట్ అని ఉంచేసుకోవచ్చును. 

2 వద్ద నున్న Post snippet వద్ద - Show post title వద్ద టిక్ మార్క్ చెయ్యాలి. ఇది డిఫాల్ట్ గా టిక్ చేసి ఉంటుంది. ఇలా చేస్తే మన బ్లాగ్ లో కనిపించే ఫీచర్డ్ పోస్ట్ లో ఆ పోస్ట్ టైటిల్ నీలిరంగులో కనిపించి, ఆ టైటిల్ లింక్ గా ఉపయోగపడుతుంది. 

3 వద్ద - Show Image వద్ద కూడా టిక్ మార్క్ చెయ్యాలి. ఈ మార్క్ కూడా డిఫాల్ట్ గా ఉంటుంది. ఆ పోస్ట్ లోని మొదటి ఫోటో ఇక్కడ కనిపించి, ఆ పోస్ట్ ని తెరిచేలా ఆకర్షిస్తుంది. ఆ ఫోటో లింక్ గా ( అంటే ఫోటో మీద క్లిక్ చేస్తే ) తెరచుకోదు. 

4 వద్ద  - All labels లో ఉన్న చిన్న నల్లని త్రికోణాన్ని నొక్కాలి. మన బ్లాగులో Labels లేబుల్స్ ని ఏర్పాటు చేసుకొని, పోస్ట్ చేసిన పోస్ట్స్ అన్నీ ఆయా వర్గీకరణల క్రిందకు ఆపాటికి చేర్చి ఉండాలి. అలా చేర్చిన పోస్ట్స్, వాటి వర్గీకరణలూ, బ్రాకెట్ లలో వాటిలోని పోస్ట్స్ సంఖ్య మీకు ఇక్కడ కనిపిస్తాయి. 

5 వద్ద - సర్చ్ బార్ ఉంటుంది. ఈ Search Bar లో మీ పాత టపా పేరు టైపు చేసి, కూడా వెదకవచ్చు. 


అదే పేజీలో క్రిందకు వస్తే -  6 వద్ద రెండు బాణం < > గుర్తులు వస్తాయి. వాటిని వాడుతూ ( ముందూ, వెనకాలకు ) వచ్చిన పోస్ట్ లలోనుండి మీరు Featured Post ని ఏది పెట్టాలనుకుంటున్నారో ఆ పోస్ట్ ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ( క్రింది ఫోటోలో చూడండి )

7 వద్ద ఆ ఫీచర్డ్ పోస్ట్ యొక్క ప్రివ్యూ Preview కనిపిస్తుంది.


ప్రివ్యూ మొత్తం ఇలా 8 లా ఉంటుంది. ( క్రింది ఫోటోలో చూడవచ్చును )

9 వద్ద Save అనే బటన్ నొక్కితే ఆ ప్రివ్యూ - మీ బ్లాగ్ లో ఒక సైడులో - మీరు ఎంచుకున్న భాగంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఫీచర్డ్ పోస్ట్ ని మీ బ్లాగ్ లే అవుట్ లో విజయవంతముగా చేర్చారు అన్నమాట.


ఇప్పుడు బ్లాగ్ లే అవుట్ పేజీలో 10 వద్ద చూపినట్లుగా ఫీచర్డ్ పోస్ట్ గాడ్జెట్ జత అవుతుంది. ( క్రింది ఫోటోలో చూడండి )

11 వద్ద చూపిన చుక్కల పట్టీని కర్సర్ తో నొక్కి, మూవ్ టూల్ సహాయాన పైకీ క్రిందగా Drog డ్రాగ్ చెయ్యవచ్చును.

12 వద్దనున్న Save Arrangements ని నొక్కి, మీ బ్లాగ్ లేబుల్స్ ప్రాధాన్యతలను సేవ్ చేసుకోవాలి.


13 ఇప్పుడు ఆ ఫీచర్డ్ పోస్ట్ మీ బ్లాగులో ఇలా కనిపిస్తుంది. మీ బ్లాగ్ కి వచ్చిన వీక్షకులు అక్కడ ఉన్న ఆ పోస్ట్ తొలి వాక్యాలు చదివి ఆసక్తి కలిగితే - ఆ పోస్ట్ లింక్ ద్వారా ఆ పోస్ట్ ని చూస్తారు. ఇలా మీరు వేసిన పోస్ట్స్ మరిన్ని వీక్షణలు చేసుకొని, మీ బ్లాగ్ వ్యూయర్ షిప్ పెరిగేలా చేస్తుంది. 



Tuesday, December 15, 2015

Quiz


3+4 = 19 
5+6 = 41 
1+3 = ?? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 


ఇదే కాకుండా మరొకలా చేస్తే వేరే జవాబు కూడా వస్తుంది. 

Sunday, December 13, 2015

పొడుపు కథలు - 18

ఆకు అలము కాదు కాని ఆకుపచ్చన, 
కాయ సున్నం కాదు కాని నోరు ఎర్రన.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
విడుపు : రామ చిలుక 


Friday, December 11, 2015

Sree Hanuman Devasthanam, Agraharam.

శ్రీ హనుమాన్ దేవస్థానం, అగ్రహారం. ( Sree Hanuman Devasthanam, Agraharam. ) ఇది తెలంగాణా లోని కరీంనగర్ జిల్లాలో వేములవాడ మండలంలో - సిద్ధిపేట కి వెళ్ళే మార్గంలో రోడ్డుకి ఆనుకొని ఉంది. చుట్టూ పెద్ద ప్రాకారముతో చాలా విశాలముగా ఉంటుంది ఈ గుడి.  ఆలయ పరిశుభ్రత చక్కగా ఉంటుంది.
ఆలయ ప్రధాన ద్వారం.
 ఆలయానికి వచ్చే ముందు - ఆలయం ముందు భాగంలో ఉన్న పెద్దనైన - ఆంజనేయస్వామివారి విగ్రహం.


ఆలయ స్వాగత తోరణం - రోడ్డు మీద నుండి ఇలా కనిపిస్తుంది.  

విశాలమైన పార్కింగ్ స్థలం ఉంటుంది. ప్రక్కనే కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ ట్యాంక్ ఉంది.  

భక్తుల సౌకర్యం కోసం నిర్మించిన సత్రాలు.  

ఆలయ లోపలి భాగం.  


ఆలయం ముందు భాగం. 

ఆలయం - ముందు భాగం - ఎడమ ప్రక్క నుండి.  

ఆలయం - ముందు భాగం - కుడి ప్రక్క నుండి.   

Monday, December 7, 2015

పొడుపు కథలు - 17


తెలిసి పూవు పూస్తుంది. 
తెలీకుండా కాయ కాస్తుంది. 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
విడుపు : వేరుశనగ 
( పూవు భూమి మీద ఉన్న మొక్కకి పూస్తుంది.
కాయ భూమి లోపల ఉన్న మొక్క వేరుకి కాస్తుంది )


Sunday, December 6, 2015

Good Morning - 596


అవసరం ఉన్నప్పుడే పలకరిస్తారని ఎవరి గురించీ బాధపడకు.. 
వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడే వెలుగులా నీవు గుర్తోస్తావని సంతోషించు..

నిజమే కదా.. బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్న నానుడిని నిజం చేస్తున్న ఈ రోజుల్లో - మనం ఏమాత్రం కష్టాల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఆర్థికంగా దెబ్బతిన్నా - మనవైపు తొంగి చూడటానికి ఎవరూ ఇష్టపడరు. కనీసం వారిని కలవటానికి వెళ్ళినా ఇంట్లో లోపల ఉన్నా లేరని చెప్పిస్తారు. ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యరు. ఇలా ప్రతివారికీ అనుభవమే. అప్పుడు మన మనసుకి ఎంతగానో బాధవేసినా, ఆ అనుభవాలు వారియొక్క నైజాన్ని, వారిని ఎంతగా నమ్మాలో తెలుసుకోవటానికి ఒక పాఠంలా ఉపయోగపడుతుందనే తెలుసుకోవాలి. ఇలా అనుభవాలు మన జీవితంలో ఎంత తక్కువ కాలంలో ఎదురైతే అంత మంచిది. మిగిలిన ఎక్కువ కాలాన్ని మరింత అందముగా, ఆకర్షణీయముగా గడపటానికి ఆస్కారం ఉంటుంది.  

మన అవసరాలకు వారు ఉపయోగపడక పోయారు కానీ, ఇప్పుడు అవసరం అయినప్పుడు ఎంత తీయగా మాట్లాడుతూ వచ్చారు అని అనుకున్నా అది బయటకి ప్రదర్శించడం అనవసరం. అలాచేసినప్పుడు వారు మనల్ని మరింతగా ఇబ్బందులకు గురిచేసే అవకాశాన్ని వారికి మీరే స్వయంగా ఇచ్చినట్లు అవుతుంది. ఫలితముగా మీకొక శత్రువుని తయారు చేసుకున్నట్లు అవుతారు. ఇందులో న్యాయా అన్యాయాల మాట ఎలా ఉన్నా - అప్పుడు వారోచ్చిన పని ఏమిటో తెలుసుకొని, అది మీవల్ల అవుతుందో లేదో ఆలోచించుకొని, అతి తక్కువ ఖర్చు, సమయంలో అయ్యేలా చూసి చెయ్యండి. ఆ సహాయం పొందాక వారు మీ అనుకూలురుగా మారితే మీకు మరీ మంచిది. వాళ్ళు చీకటిలో ఉండి, సాయం చెయ్యటానికి ఎవరూ లేనప్పుడు, మీరు మాత్రమే గుర్తుకొచ్చారు అని సంతోషించండి. కానీ - సాయం పొందిన తరవాత కూడా  ఒకవేళ  ఎప్పటిలానే వారి నైజాన్ని చూపిస్తే - 
నిశ్చయంగా వారిక మీకు అవసరం లేదు.. 
వారిని ఇక నమ్మాల్సిన అవసరం లేదు.. 
వారిని మీ మిత్రులుగానీ, శ్రేయోభిలాషుల్లా కూడా గుర్తుపెట్టుకోవలసిన అవసరం లేదు. 
వారిని ఉనికిని కూడా మరచిపోవటానికి ప్రయత్నించండి. 
ఇలా చెబుతున్నాను అని మీకు వేరేలా అనిపించినా - ఈరోజుల్లో మాత్రం అదే శ్రేయస్కరం. 

Friday, December 4, 2015

Repairing of Bolt Cutter

Bolt Cutter బోల్ట్ కట్టర్ - అనేది ఒక కత్తెర లాంటి పనిముట్టు. ఇది సాధారణ ప్రజానీకానికి అంతగా తెలీకపోవచ్చు. దీన్ని ఎక్కువగా నిర్మాణ రంగములో, ఫ్యాక్టరీలలో... మొదలగునవి చోట్ల దీన్ని వాడుతుంటారు. దీనితో కొద్దిగా మందపాటి ముక్కలని, తీగల్ని, సలాకా, బోల్ట్ లనీ, ఇనుప గొలుసులనీ.. లాంటి వాటిని కత్తిరించడానికి వాడుతుంటారు. దీనితో అర అంగుళం మందపాటి ఇనుప బోల్ట్ లనీ కొద్దిపాటి శ్రమతో తేలికగా రెండు ముక్కలుగా చెయ్యవచ్చును. అందుకే దీన్ని వెండి, బంగారు బిళ్ళల్ని కత్తిరించడానికి విరివిగా వాడుతుంటారు. దీన్ని ఎపుడూ చూడని వారు ఇలా చేస్తుంటే హశ్చర్యం గా చూస్తారు. 

నాకు ఈ పనిముట్టు పదిహేను సంవత్సరాలుగా ( 15 ) తెలుసు. అప్పట్లో చాలా క్రొత్తగా అనిపించేది. కొందామంటే చాలా ధరలో ఉండెడిది. ఇప్పుడూ ధర ఏమీ తగ్గలేదు. పైపెచ్చు బాగా పెరిగిపోయింది కూడా.. ఈ పనిముట్టులో నాకు తెలిసి మంచి ప్రోడక్ట్ అంటే HIT company - Bolt cutter. నేను మొదటగా చూసింది కూడా ఆ కంపనీ వారిదే. ఈ కంపనీ జపాన్ లో ఉంది. జపాన్ వారి పనిముట్ల నాణ్యత గురించి మీకు క్రొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదనుకుంటా. చాలా నాణ్యతగా ఉండే ఈ వస్తువు రకరకాల సైజుల్లో దొరుకుతుంది. పెద్ద సైజులో ఉన్నది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ధరనేమో చాలా మొత్తంలో ఉంది. నాకు అంత తప్పనిసరి వస్తువు కాకపోవటంతో అంతగా కొనాలన్న దృష్టి లేకపోయింది. కానీ నా దగ్గర అలాంటిది ఒకటి ఉంటే బాగుండును అనుకున్నాను. నాకు కావలసిన సైజు 24" కానీ ఆ సైజులోని ఆ కట్టర్ విలువ Rs. 2900+ గా ఉంది ఇప్పుడు. అందుకే కొనకుండా ఆగిపోయాను. ఆ కట్టర్ ఎలా ఉంటుందీ అంటే ఈ క్రింది ఫోటో చూడండి. 


ఈ పనిముట్టు - ఇనుప సలాక, కమ్మీలు, గొలుసులు, బోల్ట్ లనీ ఎలా కత్తిరించగలదో ఈ క్రింది ఫోటో చూడండి. ఇప్పుడు యాంగిల్ గ్రైండర్, పైప్ కట్టర్ మెషీన్స్, Abrasive wheels  వచ్చాక ఆయా రంగాల్లో దీని వాడకం అరుదై పోయింది. 


అలాంటి ఈ అద్భుత పనిముట్టుని నా స్వంతం చేసుకోవాలని ఉన్నా, నాకు ఎక్కువగా ఉపయోగం ఉండదు కాబట్టి  అంత ధరపెట్టి కొనడం ఇష్టం లేక ఆగిపోయాను. అలాంటిది ఈ 24" కట్టర్ పనిముట్టు విచిత్ర పరిస్థితుల్లో నా స్వంతం అయ్యింది. అదెలాగో మీకు చెప్పాలనే ఈ టపా. 

నా పనిమీద ఒక వర్క్ షాప్ కి వెళ్ళాను. అక్కడ చూస్తే ఇలాంటి పనిముట్టు ఒకటి కనిపించింది. ఒకరు వాడుతుంటే చూడసాగాను. నిర్వహణా లోపం వల్ల అది కాస్త పాడయినట్లు ఉంది. సరిగా పనిచెయ్యడం లేదు. దానితో కత్తిరిస్తున్న అతను చాలా అసహనానికి గురి అవుతున్నాడు. అతను కాదని వేరే పద్దతిలో చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. నేను ఆ వర్క్ షాప్ వాడిని అడిగా.. " ఏమైంది? " అనీ. దానికి అతడు - " అది పాడయింది.. క్రొత్తది కొనాలి.." అన్నాడు. 

నేను అన్నాను " బాగుంది కదా.. కొద్దిగా రిపేర్ చేస్తే వస్తుందేమో.. ఒకసారి నీవు ఖాళీగా ఉన్నప్పుడు నా వద్దకు దాన్ని తీసుకొని రా.. చూసి, సరి చేస్తాను.." అన్నాను. 

" కాదన్నా.. నేను చూశాను. " అన్నాడు. 

" ఒకసారి నేను ట్రై చేస్తే పోయేదేమీ ఉంది? " అన్నాను. 

ఆ తరవాత మరో నాలుగుసార్లు ఇలాగే మాటలు గడిచాయి. కానీ ఆ అబ్బాయి నా వద్దకు దాన్ని తీసుకరాలేదు. నావల్లే కానిది తనవల్ల ఏమి అవుతుందని - ఆగిపోయినట్లున్నాడు. 

మరో నెల రోజులకి - తన వద్దకి వెళితే - తన వద్ద మరొక క్రొత్త కట్టర్ కనిపించింది. " ఇదెప్పుడు కొన్నావ్..? ఎంతకి కొన్నావ్?? పాతది ఏమి చేస్తావ్..??? " అని ప్రశ్నలు గుప్పించాను. 

" నిన్ననే కొన్నాను. ఈరోజే మొదలెడుతున్నాను. ధర : రూ. 2900.." అన్నాడు. 

"మరి పాతది ఏమి చేస్తావ్ ? " 

" దాన్ని పాత ఇనుప సామానుకి అమ్మేయ్యాలి.. లేదా ఎవరికైనా ఇచ్చేయ్యాలి.. ఎవరూ రిపేర్ చెయ్యరు. ఎక్కడా రిపేర్ కాదని తెలిసింది.." అన్నాడు. 

" అలా అయితే నాకే ఇవ్వొచ్చు కదా.. నేనే తీసుకుంటాను.. అదీ నీకు ఇష్టమైతేనే.." అన్నాను. దానికి అతడు సరే అన్నాడు.. నాకు నమ్మబుద్ది కాలేదు. నిజమే అంటున్నాడా అని కాస్త ఆగి అడిగాను. తీసుకపో.. చెప్పాడు. ఎందుకైనా మంచిదని సాయంత్రం వచ్చి తీసుకెల్లుతా అని చెప్పా. తన మనసు మారి వద్దంటాడా ? అనీ. అలాని ఆగడం ఎందుకూ అంటే - నేను దాన్ని బాగుచేసుకున్నాక - వచ్చి నాది నాకివ్వు అంటే నా శ్రమ అంతా వృధానే. అందుకే ఆగాను. 

సాయంత్రం వచ్చి, దాన్ని తీసుకొని అడిగా.. ఇచ్చాడు. దాన్ని తీసుకొని వెళుతున్నా అని చెప్పా. వెళ్ళు అని చెప్పాడు. ఊరికే తీసుకోకుండా చేతిలో ఒక ఇరవై రూపాయలు పెట్టి - దీన్ని పాత ఇనుప సామానులా నీ వద్ద నుండి కొన్నాను అని చెప్పాను. ఇలా చెయ్యడం ఎందుకూ అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. 

1. ఇచ్చినది మనసు మారి వాపస్ తీసుకోకుండా చేసేలా చెయ్యడం. 
2. ఊరికే తీసుకున్నాడు.. డబ్బులేమీ ఇవ్వలేదు.. ఎంతో కొంత ఇస్తే పోయేదేమి ఉంది అనే మాటలు రాకుండా ఉండటానికి.. 
3. మనమేమీ ఊరికే అతని వద్ద నుండి తీసుకోలేదు.. కొంత డబ్బు ఇచ్చి, ఆ వస్తువుని కొన్నట్లుగా ఉండి, మనం దానికి ఇకనుండీ హక్కుదారులుగా మారుతాం. ఇక ఆ వస్తువుని అట్టే పెట్టుకోవచ్చు, దానం ఇవ్వొచ్చును, కానుకగా ఇవ్వొచ్చు, వాడుకోవచ్చును, వాడకంలో పాడయితే - వారు అడిగినప్పుడు తిరిగి క్రొత్తది కొని ఇవ్వాల్సిన ప్రశ్నే ఎదురవ్వదు. 
4. దాన్ని బాగు చేసుకొని, మనం అమ్ముకున్నా మనకే ఇక అధికారాలు సంక్రమిస్తాయి. 

ఇలాంటి కారణాల వల్ల తనకి డబ్బులిచ్చి తీసుకోవడం..

నా వద్దకు తెచ్చుకున్నా - ఒక నెల రోజులు రిపేర్ ఏమీ చెయ్యకుండా అలాగే అట్టిపెట్టాను. మనసు మారి వచ్చి, నాది నాకు ఇమ్మని అంటాడేమో అనీ.. కానీ - రాలేదు. ఆ తరవాతే దాన్ని శుభ్రం చేశాను. అందరూ దాన్ని ఎలా పడితే అలా వాడారు కాబట్టి అది బాగా జిడ్డుగా, తుప్పు పట్టి, బిగిసి పోయి ఉంది. కనీస నిర్వహణ కూడా చెయ్యలేదు. కనీస నిర్వహణ అంటే అదేదో పెద్ద పని కూడా కాదు.. వారానికొకసారి బట్టతో తుడిచి, జాయింట్ల వద్ద కొద్దిగా నూనె చుక్కలు వేసి, మళ్ళీ శుభ్రం చేస్తే సరి.. అంతే. ఇదంతా చెయ్యటానికి మహా అంటే ఐదు నిమిషాలు కూడా పట్టవు. దానికున్న బోల్టులూ నట్లూ విప్పి, అదంతా శుభ్రం చేశాను. ఆ తరవాత రిపేర్ చేయటం మొదలెట్టాను. 


ముందుగా కిరసనాయిల్ లో పాత పళ్ళ బ్రష్ ని ముంచి, వాడి పైన పేరుకొని ఉన్న త్రుప్పునీ, మురికిని తొలగించాను. ఆ తరవాత సమస్య ఎక్కడ అన్నది వెదికాను. సమస్య ఎక్కడ ఉందో గుర్తిస్తే - సగం విజయం సాధించినట్లే.. అలా చూస్తూ పోతే హ్యాండిల్స్ మధ్యలో ఉండే బోల్ట్ వద్ద అస్సలు సమస్య ఉంది. అక్కడ ఉండే బోల్ట్ రంధ్రం అరిగిపోయింది. ఈ క్రింది ఫోటోలో అది స్పష్టముగా కనిపిస్తున్నది చూడండి. గుండ్రంగా ఉండాల్సిన ఆ రంధ్రం పొడుగ్గా మారింది. ఆ కాసింత అరుగుదల వల్ల ఆ కట్టర్ పనిచెయ్యలేదు. ఇప్పుడు సమస్య ఏమిటో తెలుసుకున్నాను. అంటే సగం విజయం సాధించాను. ఇక సమస్యని సరిదిద్దాలి. ఇలాంటిదే సమస్య బైక్ సైడ్ స్టాండ్ లో కూడా ఎదురయ్యింది. మీకు వీలుంటే ఆ పోస్ట్ కూడా చూసిపెట్టండి. లింక్ : http://achampetraj.blogspot.in/2013/04/blog-post.html


ఇలా సాగిన రంధ్రం సరి చెయ్యాలీ అంటే 
ఒక పద్ధతి : వెల్డింగ్ చెయ్యడం. 
లేదా ఆ షేపులో బోల్ట్ ని అరగదీసి అక్కడ పెట్టడం. 
లేదా ఆ రంధ్రాన్ని గట్టి స్టీలు లాంటి పదార్థముతో మూసి, వాడుకోవడం.. 
ఇందులో ఆ మూడో పద్ధతియే కరెక్ట్ అనిపించింది. 

ముందుగా ఒక బోల్ట్ వెదికాను. ఆ సైజులో, సరిగ్గా అమరే, సరియైన కొలతలో ఉండే బోల్ట్ దొరకలేదు. అన్ని షాపుల్లో వెతికా.. ఊహు లాభం లేదు. చివరికి ఒక షాపుకి వెళితే - అక్కడ ముందు ట్రే లో వృధాగా పారేసిన TVS కంపనీ వారి 10.9 గ్రేడ్ బోల్ట్ కనిపించింది. 


అలాంటి గ్రేడ్ బోల్ట్స్ ఇందులకు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంటాయి. ఈ నంబర్ పెరుగుతూ ఉంటే - ఆయా వాటికి దృఢత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటికోసం వెదికా. పైన చూపిన ఫోటోలోని మధ్యలో ఉన్నదే - ఆ నంబర్ బోల్ట్. ఇవి ఎక్కువగా ఆటోమోటివ్ రంగాల్లో ఉపయోగిస్తారు. బోల్ట్ దొరికింది కాకపోతే నట్ లేదు. అయినా సరే అనుకొని ఆ బోల్ట్ ని 10 రూపాయలకు కొన్నాను. వారికి వృధా అనుకున్నది నాకు మిక్కిలి అవసరం. ఎందుకంటే చాలా శక్తి అంతా ఆ బోల్ట్ మీదే పనిచేస్తుంది. ఆ బోల్ట్ గనుక బాగుంటే ఇక అంతా బాగున్నట్లే. నట్ కూడా కావాలని రిక్వెస్ట్ చేస్తే వారే వెదికి ఇచ్చారు. హమ్మయ్య.. ఒక పని అయిపోయింది. ఇక మిగిలింది - సాగిన రంధ్రాన్ని గుండ్రముగా చెయ్యటానికి ఒక స్టీల్ ఫిలప్ మెటీరియల్. 

నా దగ్గర గ్రైండర్ గానీ, యాంగిల్ గ్రైండర్ గానీ లేకపోవటంతో - సన్నని రంపంతో ఒక నట్ ని కోసి, గరకు కాగితం మీద అరగదీశాను. ఇలా చెయ్యటానికి బోలెడంత సమయం తీసుకుంది. అయినా నాకో కట్టర్ మిగిలిపోతుందని ఇష్టముగా చేశా. అలా ఆ గ్యాప్ నిండేలా దానిని అమర్చాను. ( ఈ క్రింది ఫోటోలో ఆ ఫిలప్ ముక్క - బాణం గుర్తు వెనకాల తెల్లని అర్ధ చంద్రాకారములో ఉండి, చూపెట్టబడి ఉన్నది. దాన్ని ఆ సాగిన రంధ్రంలో అమర్చి, నట్లు అన్నీ బిగించాను ) అది ఎంత బాగా సెట్ అవ్వాలీ అంటే - అది అమర్చాక - మిగిలిన గ్యాప్ లో బోల్ట్ పెడితే - ఆ బోల్ట్ ఏమీ ప్లే లో ఉండకూడదు. అందుకే ఈ చిన్న ముక్క సెట్టింగ్ కోసం చాలా సమయం, శ్రమ, ఆలోచన చెయ్యాల్సి వచ్చింది. 


అన్నీ బిగించాక ప్రతీ జాయింట్ వద్ద కొద్దిగా నూనె వేశాను. నాలుగైదుసార్లు అలా ఆడించి చూసి, ఒక ఇనుప ముక్కని కత్తిరించి చూశాను. క్రొత్తదానిలా కత్తిరించడం మొదలెట్టింది. మరింతగా కత్తిరించి చూశాక, అప్పుడు ఒక విజయగర్వం నాలో కలిగింది.. చాలా తక్కువ ఖర్చులో ( రూ. 40 ) దాన్ని బాగు చేసుకొని, మళ్ళీ వాడుకోనేలా చేసుకోగలిగాను అన్న సంతోషం - ఈ టపా వ్రాయటానికి కారణమయ్యింది. నాకొక పెద్ద కట్టర్ ఉండాలీ అన్న కోరికా నెరవేరింది. పాతగా ఉన్న హ్యాండిల్స్ ని కలరింగ్ చేసుకోవాలి. ఇక యాంగిల్ గ్రైండర్ ని కొనుక్కోవాలి. అదొక కల. అది మొదలయింది కూడా ఈ మధ్యే. ఈ యాంగిల్ గ్రైండర్ నాకు చాలా చాలా పనులలో సాయం చేస్తుంది. క్రొత్త కట్టర్ కొనక మిగిలిన డబ్బులలో దాన్ని తేలికగా కొనుక్కోవచ్చును. అదీ త్వరలోనే కొనుక్కుంటాను. 

నాకు దీన్ని ఇచ్చిన అతనికి ఈ బాగుచేసిన కట్టర్ ని చూపించా. మొఖం వాడిపోయింది.. అనవసరంగా ఇచ్చి, మంచి కట్టర్ ని కోల్పోయి, మరో కట్టర్ని డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చిందీ అని అనుకొని ఉండొచ్చును. 


Related Posts with Thumbnails