Tuesday, August 25, 2015

ఉల్లి తిప్పలు

మార్కెట్ నుండి ఉల్లి గడ్డలు కొనుక్కొని వచ్చేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు : ( పెరిగిన ఉల్లిధరకు కామెడీగా వ్రాశాను )

1. తోడుగా ఒకరిని వెంటపెట్టుకొని పోవడం. అవసరమైతే ఒక సెక్యూరిటీ గార్డుని ఏర్పాటు చేసుకోవాలి. 

2. కొన్న తర్వాత జాగ్రత్తగా సంచి పట్టుకోవడం చాలామంచిది. 

3. ఎవరైన అపరిచిత వ్యక్తి మీ సంచిలోనుంచి ఉల్లిగడ్డ పడిపోయింది అని మీ దృష్టి మరల్చి మీ ఉల్లిగడ్డల సంచి ఎత్తుకపోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. 

4. అంగడిలో అపరిచిత వ్యక్తులతో మాట్లాడవద్దు. ఎంత కొంటున్నామో అసలే లీక్ చేయవద్దు.

5. ఉల్లి గడ్డలు కొనడానికి వెళ్ళే ముందు మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వండి..! 

6. ఉల్లిగడ్డలు దారిలో పడి ఉన్నాయని వాటిని అందుకోవడానికి ప్రయత్నించవద్దు.. అలా చేస్తే మీరు దోపిడీకి గురి కావొచ్చును. 

7. మాదగ్గర ఇన్ని కిలోల ఉల్లిగడ్డలు ఉన్నాయని గొప్పలకి చెప్పకండి. ఎవరైనా వింటే - అవి వెంటనే దోపిడీకి గురి కావొచ్చును. 

8. ఇంట్లో వాటిని ఒక CC కెమరా నిఘాలో ఉంచండి. ఎవరైనా దొంగతనం చేస్తే - సాక్ష్యాధారాలతో కేసు పెట్టవచ్చు. 

9. ఎన్ని కిలోల ఉల్లిగడ్డలు కొన్నా - నరదృష్టి తప్పించుకోవడానికి వాటిపైన మిగతా కూరగాయలు, ఆకు కూరలు కప్పండి. 

10. ఎక్కువగా ఒకేసారి ఉల్లిగడ్డలు కొనకండి. అలా చేస్తే మీరు ఇన్కంటాక్స్ వారి నోటీసులని ఎదురుకొనే ప్రమాదం ఉంది. 

11. ఫంక్షన్లలోని వంటకాలు అన్నీ ఉల్లితో చేసినవని - ఆహ్వాన పత్రాల్లో అచ్చు వేయించి, మీ హోదాని చూపండి. 

12. మీ ఇంట్లో ఉల్లిగడ్డలు ఎక్కడ పెట్టారంటూ వచ్చే మెయిల్స్ కి బదులివ్వకండి. ఆనియన్ హ్యాకింగ్ కి గురి కాకండి. 

13. మీ సోషల్ సైట్లలో ఉల్లి గురించి పోస్ట్స్ అసలే వద్దు.. చప్పిడి కూరలతో ఏదో కానిస్తున్నాం స్టేటస్ ఏడవండి.. లేకుంటే మీ ఇంటిపైన బంధు, మిత్రులు (విందు)దాడికి దిగొచ్చు. 

14. వచ్చిన ఫంక్షన్ ఆహ్వానాల్ని తప్పక మన్నించి వెళ్ళిరండి. అక్కడ ఉల్లితో చేసిన వంటకాలు కడుపారా తినేసి రండి. వచ్చేటప్పుడు - రిటర్న్ గిఫ్ట్ గా కిలో ఉల్లిపాయలు దొరికినా అదృష్టమే కదా.. 

15. మా "సురక్షా ఉల్లి కవచ యంత్ర" - అనే టెలి మార్కేట్ కుయుక్తులని నమ్మకండి. వాటిని కట్టుకున్నా మీకు ఉల్లిగడ్డలు దొరక్క పోవచ్చును. 

16. మీరు ఉల్లి కొనడానికి వెళ్ళిన కొట్లో - మీకు తెలిసినవారు ఉంటే - వారు కొని వెళ్ళిపోయాక గానీ ఆ కొట్లోకి వెళ్ళవద్దు. 


No comments:

Related Posts with Thumbnails