Monday, September 29, 2014

Good Morning - 569


కర్మను ఆచరించడం వరకే నీ బాధ్యత తప్ప, కర్మఫలం నీకు అనుకూలముగా ఉండాలని కోరుకోవడానికి నువ్వు అర్హుడివి కావు.. - భగవద్గీత 

మనకి ఏది అనుభవించాలని వ్రాసిపెట్టిందో, ఆ కర్మలని పాటించడం వరకే మన బాధ్యత. అంటే మన డ్యూటీ ఏంటో, ఆ స్థానములో ఉండి, ఏమి చెయ్యాలో అది చెయ్యాలి. ఆలా చేసిన పనుల వల్ల వచ్చే ఫలాన్ని మాత్రం మనకి అనుకూలముగా రావాలని, అలా వస్తే బాగుండును అని కోరుకోవడం తగని పని - శ్రీకృష్ణుడు గీతలో చెబుతాడు. మన బాధ్యతలు ఏమిటో, అవి చేస్తూనే పోవాలి. ఈమాత్రం కష్టపడి చేశాం కదా, ఆ కర్మల ఫలితం మనకి అనుకూలముగా ఉండాలని కోరుకోవడం సరికాదు. అంటే ఫలితం గురించి ఆశించక, మన విధులని చక్కగా నిర్వర్తించగలగాలి.. అన్నమాట. 

Thursday, September 25, 2014

Quiz

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer :


Wednesday, September 24, 2014

Quiz

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :


Monday, September 22, 2014

Quiz

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : పైవేవీ కావు.. ఎందుకంటే 0 తో హెచ్చిస్తే ప్రతీదీ విలువ 0 నే వస్తుంది. 

Saturday, September 20, 2014

Quiz

ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి చూద్దాం..? 
AB = ZY 
CD = XW 
EF = VU 
GH = TS 
IJ = RQ 
KL = ? 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.


Monday, September 15, 2014

Good Morning - 568


అన్ని ఋతువుల్లో కోయిల కూయదు..
అలాగే జీవితములో అన్నిరోజులూ సంతోషముగా ఉండవు. 

ఏదైనా జీవితసత్యంని నేర్చుకోవాలంటే ప్రకృతి కన్నా గురువు ఇంకెవరూ ఉండరు. ఆ ప్రకృతి మన జీవితములో ఎదురయ్యే ఎన్నెన్నో సమస్యలకీ, అడ్డంకులకీ తగిన జవాబు ఇచ్చే వాస్తవ ఉదాహరణలు ఎన్నెన్నో ఇస్తుంది. నిజానికి మనిషి ప్రకృతిని సూక్ష్మముగా పరిశీలిస్తే - ఎన్నెన్నో విషయాలు, మానసిక వికాసం, అనుభవ సారం... అన్నీ తెలుస్తాయి. అవన్నీ కనుల ముందే ఉంటాయి కానీ అందులోంచి తగిన పాఠాన్ని మనం అంత చటుక్కున పొందలేం.. ఎందుకంటే అవి సర్బ్వ సాధారణమైన విషయాలుగా తోచి, అందులో నేర్చుకోవటానికి ఏముందీ అని ప్రశ్నించే అంతటి అతి మామూలు విషయాలు అవి. 

అలాగే పైన చెప్పినటువంటి ప్రకృతి ఉదాహరణ కూడా అంతే..! అన్ని ఋతువుల్లో కోయిలలు కూయవు. కొన్ని ప్రత్యేక సందర్భాలల్లో మాత్రమే అవి కూ.. అంటూ కూజితాలు చేస్తుంటాయి. అదెప్పుడూ అంటే వర్షా కాలములో గానీ, సంతాన వృద్ధిలో పాల్గొనేటప్పుడు కానీ, పిల్ల కోయిలలు ఎదిగే వేళల్లో... ఇలా కొన్ని సందర్భాలలో మాత్రమే అవి అలా కూస్తుంటాయి.  ఇలా అప్పుడప్పుడు ఎలా కూస్తున్తాయో - మన జీవితాన కూడా అన్ని రోజులూ ఎప్పుడూ సంతోషంగా  ఉండవని చక్కని పోలికతో చెప్పారు. అలా అన్నిరోజులూ సంతోష రముగా ఉన్నాయి అంటే వారు నిజముగా అదృష్టవంతులే అని అనుకోవాలి. 

Saturday, September 13, 2014

Quiz

మొన్నటి రోజున నాకు 25 సంవత్సరాలు. 
వచ్చే సంవత్సరాన నాకు 28 సంవత్సరాలు వస్తాయి. 
మీరు నమ్మకున్నా ఇది నిజం. 
ఇలాంటి రోజు సంవత్సరానికి ఒకటే వస్తుంది. 
మరి నా పుట్టినరోజు ఏమిటో చెప్పగలరా ?

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.






Wednesday, September 10, 2014

Quiz

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Ans : 9


Quiz


.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

ఎలా అంటే పటంలో కనిపిస్తున్న పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న త్రిభుజాలు = 16 


ఇవే కాకుండా చాలానే ఉన్నాయి. ఎక్కడ ఎలా అంటే : 



1 ABDA 
2. BDGB 
3. FGDF 
4. ADFA 
5. BCEB 

6. BEGB 
7. CEHC 
8. EGHE 
9. FIGF 
10. GILG 

11. ILKI 
12. FIKF 
13. GHJG 
14.HJMH 
15. JMLJ 

16. GJLG 
17. AFBA 
18. BFGB 
19. ABGA 
20. AGFA 

21. BCHB 
22. BGHB 
23.BGCB 
24. CGHC 
25. FGKF 

26. GKLG 
27. FGLF 
28. FKLF 
29. GHLG 
30. HLMH 

31. GLMG 
32. GHMG 
33. ACGA 
34. CGMC 
35. GMKG 

36. AGKA 
37. BFHB 
38. BHLB 
39. FHLF 
40. BLFB 

41. AMCA 
42. AKMA 
43. ACKA 
44. CKMC 

Sunday, September 7, 2014

Good Morning - 567


Before you judge my life, my past or my character.. Walk in my shoes, walk the path I have travelled, live my sorrow, my doubts, my fear, my pain and my laughter.. Remember, everyone has a story. When you've lived my life then you can judge me. 

నన్ను అత్యంత ప్రభావం చేసిన కొటేషన్స్ లలో ఇదీ ఒకటి. 

పై కొటేషన్ ని నా సోషల్ సైట్ మిత్ర్రురాలి టైం లైన్ మీద చూశా.. ఒకసారి చదవగానే ఏదో తాకినట్లు అనుభూతి. మళ్ళీ చదివా.. వావ్!.. ఎంత అద్భుతంగా చెప్పారు అనిపించింది. ఆ కొటేషన్ ని ఇలా వెంటనే వ్రాసుకున్నాను. చిన్ని చిన్ని పదాల్లో ఎంత భావం.. అవతలివారికి మన గతం, వర్తమానం గడిచిందో చెబుతూ, వారిని ఏమీ అనకుండా సుతిమెత్తగా చెప్పినా, లాగి చెంప దెబ్బ కొట్టినట్లుగా చెప్పడం ఇందులోని భావానికే చెల్లింది. అవతలివారు మనసున్నవారు అయితే, ఇందులోని భావానికి చేష్టలుడిగి, దిమ్మరపోయి - ఏదో తప్పు చేసిన ఫీలింగ్ పొందడం ఖాయం. 

అన్ని విధాలా దెబ్బతిన్న మనిషి తనని బాధించిన ఎదుటివారిని ఏమీ అనలేక, వారు తను ప్రేమించిన వారో, అభిమానించే వారో, ఆరాధించేవారో లేక తమ కన్నా బలమైన స్థితిలో, హోదాలో ఉండి, ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఈ మాటలు అంటే - ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఎదుటివారికి మనసు అంటూ ఉంటే మాత్రం - ఎక్కడో మనసు లోలోతుల్లో దిగబడిపోతాయి. ఆతర్వాత ఎవరినేమైనా అనాలి అనుకున్నప్పుడు, వెక్కిరించాలనుకున్నప్పుడో, అవమానించాలని భావించినప్పుడో పై మాటలు చప్పున గుర్తుకవచ్చి, ఆగిపోతాడు. 

పై మాటల్ని - నాకు వచ్చీరాని తెలుగీకరణ చేస్తే - ఇలా ఉంటుంది అని అనుకుంటున్నా. 

నా జీవితాన్ని, నేనంటూ ఏమిటో, నా గతాన్ని, నా నడవడికనీ చూసి నీవు ఒక నిర్ణయానికి వచ్చేముందు - నా అడుగుల్లో అడుగు వేసి చూడు.. ( అంటే - నా వైపు నుండి చూడు ), 
నేను క్లిష్టపరిస్థితుల్లో ఏ ఏ దారుల గుండా నా జీవితాన్ని ముందుకు సాగించాన్నో గమనించు. 
నా విషాదాలల్లో, నా సందేహాలల్లో, నా భయాల్లోనూ, సంతోషాలలోనూ మరియు బాధలల్లోనూ - నాతో మమేకమై వీక్షించు. 
అప్పుడు గానీ ఒక నిర్ణయానికి రాకు. 
గుర్తించుకో - ప్రతివ్యక్తికీ ఒక కథ ఉంటుంది. 
నీవు నన్ను ఏమిటో అని నిర్ణయించుకొనే ముందు, ఒకసారి నా జీవితములోకి ప్రవేశించి, నాతో గడుపు /కలిసి అడుగువేయి.. 
అప్పుడు నేనేమిటో నీకు తెలుస్తుంది. 

సరిగ్గా తెలుగులో చెప్పలేకపోయాను అని అనుకుంటున్నాను.. అందులకు మన్నించండి. 

చాలా గొప్పగా ఉంది కదూ ఈ భావన. నాకైతే మరీ మరీ గొప్పగా నచ్చేసింది. ఇది ఏరోజైతే చూశానో - ఆరోజు నుండీ పాజిటివ్ గా చూడటం మొదలయ్యింది. ప్రతివారి కష్టాల గురించీ, వారి వైపు నుండి ఆలోచించటం మొదలయ్యింది. వారిని అర్థం చేసుకోవటం మొదలయ్యింది. వారు చేసింది ఏదైనా నాకు తప్పుగా అనిపించినా, దానివెనక కారణమేదో ఉండి ఉంటుందని అనుకొని అలా ఆలోచించటం మొదలెట్టాను. చాలా విషయాల్లో - వాటివెనక ఉన్న అసలు విషయాలను గ్రహించగలిగాను. ఫలితముగా వారిపట్ల ద్వేషం కలగాల్సింది పోయి, ఒకవిధమైన జాలి కలిగింది. అంతా నామంచికే జరుతున్నదని భావించాను. వారు వారి వారి జీవితాల్లో ఒక గొప్ప ( స్నేహ / ఆత్మీయ / మానవ ) బంధం దూరమవుతున్నారనీ, వారు నాపై ఒక ఎవరివో చెప్పుడు మాటలు విని ఒక తప్పుడు అభిప్రాయానికి వచ్చారని అర్థం చేసుకున్నాను. అలా దూరమవటం నాకు ఎంతగానో లాభించింది. ఇక్కడ వారే దూరమయ్యారా ? లేక నాకే అలా అవకాశమిచ్చారా అన్నది అప్రస్తుతం. నాజీవితం మరో మలుపు తీసుకుంది.... నన్ను అర్థం చేసుకున్న వారితో కలుపుగోలుగా ఉంటూ హాయిగా క్రొత్త బంధాలని ఏర్పరచుకున్నాను. (ఆ విషయాలని తరవాత ఎప్పుడైనా చెప్పుకుందాం)

నన్ను హేళన చేసిన వారినీ, నన్ను చూసి నవ్వుకున్న వారినీ, నన్ను సామాజికముగా బహిష్కరించాలని చూసినవారినీ, నన్ను చూసి ఫన్ చేసుకున్న వారిని, భౌతికముగా / మానసికముగా దాడి చెయ్యాలనుకున్న వారినీ, నామీద చెడుగా చెప్పి అవతలివారికి దగ్గర అవ్వాలని చూసినవారినీ, అందరూ కలిసి నన్ను టోటల్ గా జీరో కనిపించేలా చేసేయ్యాలనుకున్న వారూ, రెచ్చగొట్టి లాభం పొందాలనుకున్న వారినీ... ఆఖరికి కొందరిని నా నుండి దూరం చెయ్యాలని ప్రయత్నించి విజయం సాధించినవారినీ చూశాక - అప్పుడు ఆ పై కొటేషన్ గుర్తుకు వచ్చింది. 

కానీ అపనమ్మకం, అనుమానం, హేళన, అవమానించడం... ఇవన్నీ తాత్కాలికమైనవి. నిజమైన సత్యం ఏమిటో తెలుసుకున్నప్పుడు - అప్పుడు జీవితాన ఎంత పెద్ద తప్పు చేశామో తెలిసిపోతుంది. అప్పుడు వారికి జీవిత చరమాంకం వరకూ బాధనే తోడుగా ఉంటుంది. ఎవరి ప్రాప్తం వారిది. 

Saturday, September 6, 2014

Quiz

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :


Friday, September 5, 2014

Teachers day greetings


గురువు చేసే భోదనే శిష్యుని స్వభావాన్ని తీర్చిదిద్దుతుంది. జీవితాన్ని అర్థవంతం చేసే ఆధ్యాత్మిక గురువులకు, జీవికను ప్రసాదించిన ఉపాధ్యాయులకు శతకోటి ప్రణామాలు. 

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. 



Thursday, September 4, 2014

Quiz


.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.


Wednesday, September 3, 2014

Quiz

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 81
పైన ఉన్న అంకెలని అదే అంకెలతో హేచ్చిస్తే క్రిందన ఉన్న అంకెలు వచ్చాయి. వచ్చిన అంకెలను అంతే మొత్తం తో తిరిగి హెచ్చిస్తే, జవాబు వస్తుంది. ఉదాహరణగా : 3 ని అదే సంఖ్యతో అంటే 3 తో హెచ్చిస్తే 9 వస్తుంది. మళ్ళీ 9 ని మళ్ళీ 9 తో హెచ్చిస్తే జవాబు 81 వస్తుంది. 

Related Posts with Thumbnails