Saturday, June 14, 2014

పేజీల Manage Selections

ఫేస్ బుక్ లో పేజ్ లది ఒక ప్రత్యేక స్థానం. ఎన్నెన్నో రకాల పేజెస్ ఉన్నాయి. కారణం ఈ పేజెస్ ని మొదలు పెట్టడం, నిర్వహించడం గ్రూప్స్ కన్నా చా--లా సులువు. అలాగే ఆ పేజీలని లైక్ చేసిన వారు ఆ పేజీలలో ఉన్న విషయాన్ని తేలికగా  చూసేలా ఆ పేజీ లే అవుట్ ఉంటుంది. కావున చాలామంది క్రొత్తగా ఏదైనా ఒక విషయం గురించి తెలియచెయ్యాలన్నా ముందుగా ప్రారంభించేది ఈ పేజెస్ ని. ఈ పేజెస్ ని నిర్వహించేవారు ఈ ఫేస్ బుక్ లో సభ్యత్వం ఉన్నవారే నిర్వహిస్తారు. ఫేస్ బుక్ అకౌంట్ ఉన్న ప్రతివారూ ఏదో ఒక పేజీలో సభ్యులు అవటం చాలా చాలా సాధారణ విషయం. ఈ పేజెస్ గురించి మరిన్ని విషయాలు మళ్ళీ ఎప్పుడైనా చెబుతాను. 

ఇప్పుడు మీకు లే అవుట్ లోని ఒక భాగాన్ని గురించి చెబుతాను. నిజానికి అంత ముఖ్యమైన విషయం కాదు కానీ పేజీ వీక్షకులకి కాస్త ఈజీగా ఉండేలా కొన్ని టూల్స్ ని వారికి అందుబాటులో ఉంచవచ్చును. ఇలా చెయ్యడం వల్ల పేజీని చూడటానికి అందముగా, సౌకర్యవంతముగా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని ఒకసారి మీరు నిర్వహిస్తున్న పేజీలకి సరిచూసుకుంటే సరిపోతుంది. 

06 జూన్ 2014 న ఫేస్ బుక్ లోని అన్ని పేజీల  లేఅవుట్స్ ని ఫేస్ బుక్ వారు మార్చారు. పది రోజుల ముందుగా అన్ని పేజీల అడ్మిన్ లకీ - ఆ పేజీ టైం లైన్ మీద కనిపించేలా ఇలా ఈ క్రింద కనిపించే సూచనని పెట్టారు. ముందుగా తమ తమ పేజీలని అప్డేట్ చేసుకున్నారు కొందరు. చేసుకోని పేజీలన్నింటినీ ఆరో తేదీన ఆటోమేటిక్ గా అప్డేట్ చేశారు. అందులో కొన్ని సెట్టింగ్స్ ఒక్కొక్కటీ మీకు నా వీలు వెంబడి చెబుతాను. ఇప్పుడు పేజీలో ఎడమ ప్రక్కన కనిపించే About me, Friends, Post to page... వీటి లే అవుట్ సెట్టింగ్ గురించి చెబుతాను. 


పేజీ టైం లైన్ లో బాగా ఎడమ వైపున ఉండి, మొదటగా కనిపించేది - People. ఇందులో - ఆ పేజీని లైక్ చేసి, ఆ పేజీని ఫాలో అయ్యే మన స్నేహితులు ఎవరైనా ఉంటే - ఇక్కడ ఇక్కడ వారి వారి ప్రొఫైల్ ఫోటోలు థంబ్ నైల్ చిత్రాల రూపములో కనిపిస్తాయి. ఆ పేజీలలో మన ఫేస్ బుక్ మిత్రులు ఎవరున్నారో, ఎందరున్నారో తేలికగా తెలుసుకోవచ్చును. 

ఇలా పీపుల్, అబౌట్ మీ... లాంటి హెడ్డింగ్స్ గల బూడిద రంగు ( Gray Colour ) మీద ఉన్న కుడి వైపుకు చూస్తున్న బాణం గుర్తు వద్ద మౌస్ కర్సర్ ని ఉంచితే - ఒక పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది. ఇలా కనిపించటం కేవలం ఆ పేజీ అడ్మిన్ లకి మాత్రమే. వీక్షకులకీ, లైక్ చేసిన వారికీ, ఫాలో అయ్యే వారికీ కనిపించదు. ఆ గుర్తుని Manage అని అంటారు. అది ఎలా ఉంటుందో ఈ క్రింది ఫోటోలో చూడవచ్చును. 


Manage ని కర్సర్ తో నొక్కితే అప్పుడు మీకు చిన్నగా  Manage Selections అంటూ ఒక విండో కనిపిస్తుంది. అప్పుడు దాన్ని కర్సర్ తో నొక్కాలి. 


అలా నొక్కాక - ఈ క్రింది విధముగా మీకు ఒక మెనూ కనిపిస్తుంది. అదే ఆ పేజీ Manage Selections సెట్టింగ్స్ పట్టిక. ఇందులో మీకు 1, 2 అని ఎర్రని అంకెలతో చూపెట్టిన  People, About ని డ్రాగ్ చెయ్యలేం. అంటే పైకీ, క్రిందకీ మౌస్ లోని ఓకే క్లిక్ ( ఎడమ క్లిక్ ) ని వాడి, మూవ్ టూల్ తో జరపలేము. అవి అలాగే ఫిక్స్ అయి ఉంటాయి. 

ఇక ఎర్రని వృత్తములో చూపబడిన Photos, Posts to page, Reviews, Notes... ఇలాంటివన్నీ పైకీ, క్రిందకి మనకి నచ్చిన తీరులో మౌస్ ఎడమ క్లిక్ ని నొక్కి పట్టి, డ్రాగ్ చేస్తూ, మనకి నచ్చిన క్రమములో పెట్టుకోవచ్చును. అలా చేసిన పిదప క్రిందన ఉన్న Save   ని నొక్కితే అవన్నీ మనం పెట్టుకున్న క్రమంలోనే ఉండిపోతాయి. ఇలా సెట్టింగ్స్ చెయ్యటం ఆయా పేజీల అడ్మిన్ ( నిర్వాహకులకి ) మాత్రమే వీలవుతాయి అని మరొకసారి గుర్తు చేస్తున్నాను. 



No comments:

Related Posts with Thumbnails