Tuesday, June 4, 2013

వేయి స్తంభాల గుడి, హనుమకొండ.

ఆ తరవాత నేను దర్శించిన ఆలయం - వేయి స్థంభాల గుడి - Thousand pillar temple. ఇది హనుమకొండలో ఉన్నది. నగర మధ్యలో, ప్రధాన రోడ్డుకి ఆనుకొని ఉంది. GPS లో దారి చూశాం. ఒక సందు గుండా వెళ్ళాలి అని చూపించింది. అలాగే వెళ్ళితే - ఆ దారి మూసివేశారు. ప్రధాన రహదారి వైపు నుండి లోనికి వెళ్ళాలి అని చెప్పారు. మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి వచ్చి ఆలయానికి వెళ్ళాం. రోడ్డు మీద నుండే ఈ ఆలయం కనిపిస్తుంది. బైక్ అక్కడ పార్క్ చేసి, పార్కింగ్ టోకెన్ తీసుకొని, లోనికి వెళ్ళాం. 

లోపలి వెళ్ళాం. కాకతీయ రాజుల కాలం నాటి శిల్పకళకి చక్కని ఉదాహరణ - వేయి స్థంభాల గుడి. ఈ ఆలయం ఎత్తైన పీఠం మీద కట్టారు. చక్కని, సూక్మమైన శిల్పకళా నిలయం ఈ గుడి. ఇంతకు ముందు మూడు సార్లు ఈ గుడికి వచ్చాను. ఇది నాలుగోసారి. 

నల్లని గ్రానైట్ రాయితో గుడులు కట్టడం చాలా అరుదు. అందునా ఆ నల్లసరం గ్రానైట్ రాయితో శిల్పాలని చెక్కడం, వాటితో ఆలయం నిర్మించటం చాలా అరుదు. ఎందుకంటే నల్లని గ్రానైట్ బరువు చాలా ఎక్కువ. శిల్పాలు చెక్కటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాకపోతే కొన్ని ప్రత్యేకతలు ఆ రాయితో చేసిన శిల్పాలకి ఉంటుంది. ఆ రాతితో చెక్కిన శిల్పాలలో సన్నని, నిశిత చెక్కడాలు తేలికగా చెక్కొచ్చు. శిల్పులకి చాలా ఈజీగా ఉంటుంది. అంతగా తేలికగా చెక్కుతుండగా విరిగిపోవు. ఇక్కడ శిల్పాలలో అన్నింటికన్నా అత్యద్భుతమైనది - ఈ శిల్పాలని , స్థంభాలనీ చెక్కి, వాటిని నునుపుగా చెయ్యటం. ఇది నిజముగా అద్భుతం. సందు సందులలో సన్నని దారులలో కూడా అలా పాలిష్ చెయ్యడం - నిజముగా గొప్ప విషయం. ఇక్కడే ఈ శిల్ప సౌందర్యం ఏమిటో, మన వాళ్ళ ప్రతిభ ఏమిటో తెలుస్తుంది. కానీ మన బ్యాడ్ లక్ ఏమిటంటే - ఈ శిల్పాలకి అంత గొప్ప పేరు లేదు. అది మనందరి లోపం. విదేశీయులకి ఈ ప్రతిభ బాగా తెలుసు. అందుకే - ప్రపంచ హెరిటేజ్ సంస్థ వారు ఈ ఆలయాన్ని ఎప్పుడో పరిగణలోకి తీసుకున్నారు. ఈసారి ఫొటోస్ ఏమీ ఎక్కువ తీయలేదు. కారణం ఇంతకు ముందే కొన్ని వీడియోలు, ఫొటోస్ పబ్లిష్ చేశాను. కనుక ఈసారి ఎక్కువగా పెట్టడం లేదు. 


ఇది వేయిస్తంభాల ఆలయానికి ప్రధాన దారి. 


ఆలయ చరిత్ర.


ఆలయ చరిత్ర  - ఇంగ్లీష్.


కొలను.  


కొలను.


త్రికూటాలయము. అంటే మూడు ఆలయాలు ఒకేచోట ఉండి, మధ్యలో నృత్యాలకీ, సభలకీ వృత్తాకార మంటపం ఉంటుంది. ఆ మంటపానికి నాలుగు దిక్కులా ఉన్న స్తంభాలు, మూడు ఆలయాలకి ఉన్న శిల్పకళని మాటల్లో వర్ణించటం అసాధ్యం. ఆ పనితనానికి శిరస్సు వంచి, నమస్కరించాల్సిందే. 


ఆలయానికి వెళ్ళే ముందు ఉండే నంది. మెడలోన ఉన్న పట్టీ, వాటికి ఉన్న అలంకరణలు హైలెట్. కానీ దండయాత్రల్లో, యుద్ధాలలో ఈ శిల్పకళని ధ్వంసం చేశారు. 


మూడు ఆలయాల్లో ఎడమవైపున ఆలయములో మాత్రమే పూజలు, పునస్కారాలు జరుగుతాయి. మిగిలిన రెండింటిలో విగ్రహాలు లేవు. ఖాళీగా ఉంటాయి. ఈ ఎడమవైపున ఉన్న ఆలయములో భారీ శివలింగం ఉంటుంది. ఆ శివాలయాన ఉండే అర్చన వివరాలు పై ఫోటోలో చూడొచ్చును. 


శిల్పకళని చూడండి. 


నందీశ్వరుని విగ్రహం మీద ఉన్న కళాత్మకత ఏంటో చూడండి. నంది ఇలా కూర్చొని, శిలా రూపముగా మారిందా అన్నట్లు ఉంటుంది. 


ఈ పైనున్న స్థంభాన్ని పరిశీలనగా చూడండి. దాని మీద ఉన్న శిల్పి పాటవాన్ని శ్రద్ధగా పరికించి చూడండి. సూక్ష్మ చిత్రీకరణలు మాత్రమే కాకుండా - ఆ స్థంభం మీద మధ్యలో నలువైపులా ఉన్న త్రికోణాకార డిజైనులని చూడండి. రాతిని సన్నగా చేసి, ఆ డిజైన్ ని చెక్కి, ఆ స్తంభానికి యే జిగురుతో  అతికారేమో అన్నట్లుగా అనిపిస్తుంది. కాని స్తంభాములోని భాగముగా చెక్కారు. ఆ త్రిభుజానికీ, స్థాభంకీ మధ్య సన్నని సందు కూడా ఉంటుంది. ఇలాంటి అద్భుతాలు మరెన్నో.. ఈ స్థంభం మీద ఉన్న అనేకానేక అద్భుతాలలో మరొకటీ కూడా చెబుతాను. 

దాని పైన ఉన్న వర్తులాకార శిల్ప డిజైన్ ఉన్న రింగుని  చూడండి. అది దేనితోనో చేసి, అలా డిజైన్ చెక్కి, రంధ్రాలు చేసి, స్థంభానికి అతికారేమో అన్నట్లుగా ఉంది కదూ.. నిజానికి అది స్థంభములోనే ఒక భాగం. అంటే అది చేక్కేటప్పుడే అలా దాన్ని అక్కడ సృష్టించారు. రాతిలోనే అలా పైన డిజైన్స్ చెక్కి, మధ్యలో రంద్రాలు చేసి, మళ్ళీ అది సన్నని రాతి గుండ్రని పట్టీ ఉన్నట్లుగా వెనకాల ఉన్న రాత్రిని తోలిచేసేయ్యటం, పాలిష్ చెయ్యటం - వావ్! నిజముగా అత్యద్భుతం. శిల్పాల గురించి తెలిసినవారికే, ఆ అద్భుతం ఏమిటో బాగా అర్థం అవుతుంది. 


ఆలయ శిలా సంపద. 


ఇలా ఆలయ అభివృద్ధి పనులు ఇంకా జరుగుతున్నాయి. ప్రక్కనే ఇంకో ఆలయం కడుతున్నారు. ఆ ఆలయం పని మీద ఇలా చెక్కుతున్నారేమో..


నిర్మాణ పనులు. 


వేయి స్తంభాల ఆలయం. 

No comments:

Related Posts with Thumbnails