Saturday, June 16, 2012

గిఫ్ట్ కవర్స్ Gift Covers - 10

పెళ్ళిపత్రికలతో గిఫ్ట్ కవర్స్ ఎలా చెయ్యాలో చూశాము కదా.. ఇప్పుడు వాటికి మరింత హంగులు చేరుస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ముందు చెప్పుకున్నట్లు - రిబ్బన్ ట్యాగ్ ని అమర్చితే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రిబ్బన్ ట్యాగ్స్ వేరు వేరు సైజుల్లో దొరుకుతాయి. మనకి ఈ కవర్స్ కోసం చిన్న సైజులోనివే కావాలి. ఇవి వివిధ ప్రింట్స్ లలో, వివిధ సైజులలో, వివిధ రంగుల్లో ఉంటాయి. చిన్న సైజులోనివి రెండు నుండి, మూడు రూపాయల్లో దొరుకుతాయి.

ఈ రిబ్బన్స్ ట్యాగ్స్ రెండు పొరలుగా ఉండి, లోపల రెండు పట్టీలు ఉంటాయి. పైన పొరల్ని ఒకమాదిరిగా గట్టిగా పట్టుకొని, లోపల ఉన్న పట్టీలని లాగితే గిఫ్ట్ రిబ్బన్ లా మారుతుంది. మొదట్లో ఇలా రెండు, మూడు అనుభవం కోసం లాగితే ఈజీగా వీటిని ఎలా వాడాలో తెలిసిపోతుంది. మొదట్లో అయితే రెండు, మూడు స్పేర్ గా ఉంచుకోవాల్సి ఉంటుంది. 

ఇప్పుడు ఒక పెళ్ళి పత్రికతో చేసిన గిఫ్ట్ కార్డ్ ని ఎంచుకుందాం. అంటే బేస్ గిఫ్ట్ కార్డు Base Gift card అన్నమాట. దీని మీద మన ఓపిక మేరకి అలంకరణ చేసుకోవచ్చును. ఈ ఒక్క రిబ్బన్ చుడితే ఎలా ఉంటుందో చూద్దాం. 


ఇలా ఉన్న కార్డ్ కి చమ్కీలు, పూసలు అతికితే ఇంకా లుక్ వస్తుంది. ఇప్పుడు ఈ గిఫ్ట్ రిబ్బన్ అమర్చుదాం. 


ఇప్పుడు బాగా అనిపిస్తుందా?.. ఇంకో పోస్ట్ లో Zig zag కత్తెరతో కటింగ్స్ గురించి నేర్చుకుందాం. 


No comments:

Related Posts with Thumbnails