Sunday, October 30, 2011

Mobile Key pad

మొన్న మొబైల్ లో బ్యాలన్స్ వేయిద్దామని వెళ్లాను. అక్కడ అంతకు ముందే ఒకతను తన ఫోన్ రిపేర్ కోసం వచ్చాడు. ఆ ఫోన్ క్రొత్తగా ఉంది.. కానీ బాగా వాడాడు కాబట్టి దాని కీ ప్యాడ్ బాగా అరిగిపోయి, నంబర్స్ ఏవి ఏవో కనిపించకుండా పోయాయి. అది ఎలా చెయ్యాలి అని అడుగుతున్నాడు. నిజానికి అది చాలా చిన్న ప్రాబ్లెం. ఎలా సాల్వ్ చేస్తారు?.. ఎంత చార్జ్ చేస్తారో అని అని - నా ఫోన్ లో బ్యాలన్స్ వచ్చేవరకు అన్నట్లు ఆగాను.

ఫోన్ విప్పేసి, వెనకాల ఉన్న ప్యానెల్ తొలగించి, బ్యాటరీ మరియు సిమ్ కార్డులని తీసేసి, వాటికి ఉన్న చిన్నని, సన్నని స్క్రూస్ తీసేస్తే, ముందున ఉన్న కీ బోర్డ్ ప్యానెల్ ఫ్రేం ఓపెన్ అవుతుంది. క్రొత్తది కీ ప్యాడ్ ఎక్కించి, మళ్ళీ బిగిస్తే సరి. ఈమాత్రం దానికి ఎలా రిపేరింగ్ చార్జెస్ ఉంటాయో చూద్దామని ఆగాను.

ఆ షాప్ వాడు ఆ ఫోన్ ని చూసి కీ ప్యాడ్ మార్చాలి. మొత్తం నూటాఎనభై రూపాయలు అవుతుంది అని చెప్పాడు. అబ్బా అంతనా?.. అని నేను షాక్ లో ఉన్నాను. ఆ ఫోన్ యజమాని బేరం మొదలెట్టాడు. చివరికి నూటా అరవై కి బేరం కుదిరింది. ఇక నేను బయటకి వచ్చాను. బయట మొబైల్ ఫోన్ షాపుల్లో కేవలం పది, పదిహేను రూపాయలు ఉండే ఆ కీ ప్యాడ్ అంత ధర చెప్పటం మరీ షాకింగ్ గా ఉంది. కంప్యూటర్ కీ బోర్డ్ యే నూటా యాభై రూపాయలకి దొరుకుతున్నది.. అంత చిన్న దానికి అంత రేటా?

కొన్ని విషయాలు కాసింత జాగ్రత్తగా ఉంటే - చాలా అనవసర ఖర్చులు తగ్గించుకోవచ్చును. 

No comments:

Related Posts with Thumbnails