Thursday, September 22, 2011

Gold Jewellery Nano

భారతదేశములోని బాగా చవకైన కారు ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. కళ్ళు మూసుకొని తేలికగా చెప్పగలరు " నానో " కారు అనీ. అదిప్పుడు చవకైనదే కాదు, చాలా ఖరీదైన కారుగా కూడా మారింది. అవునా ఎలాగా? అని అనుకుంటున్నారా?.. బుగేట్టీ వేరాన్ కారు భారత దేశములో 16 కోట్లుగా ఉందని అంచనా.. ఆ కారు కన్నా ఈ నానో కారు ధర (20 కోట్లు) ఇంకాస్త ఎక్కువ ఖరీదు చేస్తుంది. అది ఎలాని తెలుసుకోవాలని ఉందా?.. ఓకే.. 


కాని ఈ కారుకి ఒక విచారకర ప్రత్యేకత కూడా ఉందండోయ్!. ఈ కారుని ఎవరికీ అమ్మరు.. కేవలం నానో కారు అమ్మకాలకోసం అనీ దీన్ని ప్రమోషనల్ కాన్సెప్ట్ కారుగా వాడదలచుకున్నారు. అంతే!. టాటా కంపనీ అధినేత రతన్ టాటా దీన్ని తమ సొంత సోదర సంస్థ అయిన గోల్డ్ ప్లస్ జేవేల్లెరి సంస్థలో చేయించారు. 


ఈ కారు యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే - ప్రపంచములో మొదటి బంగారు నగషీ పనితనం ఉన్న కారు.. అలాగే దీన్ని చేసేందుకు 80 కిలోల 22ct బంగారం, 15 కిలోల వెండీ, అలాగే 10,000 పైగా వజ్రాలు, రతనాలు చేసి, పొదిగిన కారుని చూడటానికి రెండు కళ్ళూ చాలవు అనుకోండి. కావాలంటే ఈ క్రింది ఫొటోస్ చూడండి. మీకే తెలుస్తుంది. 









No comments:

Related Posts with Thumbnails