Sunday, July 17, 2011

Search in Blog

అంతర్జాలం అనేది అంతులేని సముద్రం. అందులో మనకి కావాల్సిన అంశాన్ని వెదకటానికి సర్చ్ ఇంజన్ ల సహాయముతో వెదుకుతాము కదా. గూగుల్ సర్చ్ అంటే ఏమిటో, అందులో సర్చ్ చేస్తే ఎలా మనకి కావలసిన అంశాలు ఎలా దొరుకుతాయో, ప్రతి నెటిజన్ కీ అనుభవపూర్వకమే! గూగుల్ సర్చ్ మాదిరిగానే ఎన్నెన్నో టపాలు గల బ్లాగుల్లో మనకి కావలసిన విషయాన్ని వెదికేందుకు కూడా అలాంటి సర్చ్ ఇంజన్స్ ఉన్నాయి. ఇవి కూడా ఆ గూగుల్ సెర్చ్ ఇంజన్ లాగే పనిచేస్తాయి. వీటిని ఇక్కడ గాడ్జెట్స్ (ఉపకరణాలు) రూపములో దొరుకుతాయి. ఈ గాడ్జెట్ వల్ల తేలికగా తెలుసుకోవచ్చును. ఈ గాడ్జెట్ ని నేనూ నిన్ననే తెలుసుకున్నాను - అదీ చాలా ఆలస్యముగా. అది తెగ బాగా నచ్చేసి, మీకూ పరిచయం చెయ్యాలనుకొని, మీకు ఈరోజు అందిస్తున్నాను.

  ఫోటోలు సరిగా కనిపించకపోతే వాటి మీద డబల్ క్లిక్ నొక్కండి. 

ముందుగా మీరు మీ బ్లాగు హోం పేజిలోకి అయినా, ఉన్న బ్లాగ్ పేజీలోనైనా టూల్ బార్ లోని Design 1 లేదా 2 ని నొక్కండి.

అలా నొక్కాక 3 వద్ద కనిపించే Add a Gadget ని ఎన్నుకోండి / నొక్కండి. 


ఇప్పుడు వచ్చిన గాడ్జెట్ మెనూ లో 4 వద్ద నున్న Search Box ని ప్రక్కన ఉన్న సైడ్ బార్ ని జరిపి, వెదకండి. అలాగే 5 వద్ద నున్న + మార్కు ని నొక్కండి. అలా నొక్కగానే -


..అప్పుడు Configure Search Box వస్తుంది. అది ఈ క్రింది బాక్స్ లా ఉంటుంది.  


అందులో మీరు Search This Blog అని అక్కడ 6 అలాగే ఉంచెయ్యాలి అని అనుకుంటే - అలాగే ఉంచెయ్యండి. లేదా అక్కడ మీరు మీకు నచ్చినట్లుగా ఏదైనా టైప్ చేసి మార్చి, 7 వద్ద నున్న Save ని నొక్కేయ్యండి.


..ఇప్పుడు మీ పేజిలో ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ 8 వద్ద ఉన్న Save ని మళ్ళీ నొక్కండి. మీకు అభినందనలు. ఇప్పుడు ఆ గాడ్జెట్ మీ బ్లాగ్ లో ఆడ్ అయ్యింది.


ఆ సెర్చ్ బాక్స్ 9 లో ఏదైనా పదం టైప్ చేసి, Search ని నొక్కండి. ఉదాహరణకి నా బ్లాగ్ లో మీరు ఎప్పుడో స్నేహం అనే టాపిక్ మీద ఒక వ్యాసం చూశారు అనుకుందాము. అదిప్పుడు మళ్ళీ చూడాలీ అనుకుంటే ఆ టపా ఏమిటో, ఆ టపా హెడ్ లైన్ ఏమిటో మీకు అంతగా తెలీకపోవచ్చును. మరచిపోవచ్చును కూడా. అప్పుడు మీరు సింపుల్ గా ఒక పని చెయ్యండి. "స్నేహం" అనే పదముతో ఉన్న టాపిక్ ని వెదకాలి అనుకుందాము. ఇప్పుడు ఆ స్నేహం అనే పదాన్ని ఆ సెర్చ్ బాక్స్ లో టైప్ చేసి, సెర్చ్ బటన్ ని నొక్కేద్దాం.


అప్పుడు 9 వద్ద చూపించినట్లుగా నా బ్లాగ్ లోని స్నేహం అనే పదమున్న పోస్ట్స్ అక్కడ కనిపిస్తాయి. ఆ టపా లింకూ, పోస్ట్ డేటు, అందులోని ఆ పదముతో కొనసాగే ఒకటిన్నర లైన్ల వాక్యం, బ్లాగ్ పేరూ మీకు గూగుల్ సెర్చ్ మాదిరిగా చూపిస్తుంది. ఇలా ఆ బ్లాగ్ లోని మీకు నచ్చినది వెదకవచ్చును. ఇది ఉపయోగించి, ఆ బ్లాగ్ లోనిదే కాకుండా అంతర్జాలములో ఏదైనా అక్కడినుండే వెదకవచ్చును. అలా వచ్చిన లింకుల మీద నొక్కి ఆ టపాలని చూసుకోవచ్చును.

ఈ బాక్స్ ని క్లోజ్ చెయ్యటానికి, ఆ బాక్స్ కుడి మూలన ఉన్న X బటన్ ని నొక్కి, క్లోజ్ చెయ్యవచ్చును.


బాగుంది కదూ.. ఇంకేం మీరూ ప్రయత్నించండి.

No comments:

Related Posts with Thumbnails