Thursday, February 3, 2011

Social NW Sites - 11 - మీ ప్రొఫైల్ మీరు చూసుకోవటమ్..

మీరు మీ ప్రొఫైల్ ఓపెన్ చేశాక - మీకు వీలున్నప్పుడల్లా ఆన్లైన్ కి వస్తూనే ఉంటారు. మనకి ఉండేదే కొంత సమయం. దాన్ని ఇక్కడ మీరు సరిగ్గా వాడుకోగలగాలి. మీది నెట్ కనెక్షన్ అన్ లిమిటెడ్ ఆయితే బాగుంటుంది. డిఫాల్ట్ పేజీగా దాన్ని పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే నెట్ కి రాగానే అదే పేజి ఓపెన్ అవుతుంది. మీరు వాడుతున్నది ఇంటర్నెట్ ఎక్ప్లోరర్ 8 ఆయితే ఇలా చేసుకోవచ్చు. కమాండ్ బార్ లో ఉన్న టూల్స్ ని నొక్కితే ఇలా వస్తుంది.

ఈ టూల్స్ నొక్కాక, వచ్చిన మెనూలో ఇంటర్నెట్ ఆప్షన్స్ కి వెళ్ళండి. అప్పుడు ఇలా క్రింది దానిలా వస్తుంది. 

మన స్క్రాప్ బుక్ అడ్రెస్ అక్కడ కాపీ, పేస్ట్ చేసి, క్రింద ఓకే చేసుకుంటే ఇక మనం నెట్ కి లాగిన్ అవగానే - ఆ పేజీయే ఓపెన్ అవుతుంది. అలా చేస్తే వెంటనే మన స్క్రాప్ బుక్ లో ఉంటాము. ఇలా చెయ్యటం మనకంటూ స్వంత కంప్యూటర్ ఉంటేనే చెయ్యటం మంచిది. లేకుంటే చాలా ఇబ్బంది పడతారు. షేరింగ్ లో ఉన్న సిస్టం ఆయితే ఈ జోలికి పోవటం అంత క్షేమకరం కాదు.

ఇలా ఎందుకు చెయ్యాలంటే - వచ్చిన స్క్రాప్స్ కి వెంటనే రిప్లై ఇవ్వొచ్చు. వాటికి రిప్లై ఇచ్చేసి, మన కమ్యూనిటీ, హొం పేజీ, అప్డేట్స్, ఫోటో కామెంట్స్, రేసేంట్ విజిటర్స్.. చూసుకుంటూ ఉండొచ్చు.. మధ్య మధ్యలో ఈ స్క్రాప్ బుక్ లోకి వస్తుంటే చాలు. అన్నీ చూసేలోగా - ఏమైనా స్క్రాప్స్ వస్తే రిప్లై ఇవ్వాలి. చివరిలో మీకు వచ్చిన ఆడ్ రిక్వెస్ట్ ల సంగతి చూడవచ్చును. ఇలా చేస్తే మీకు కొంత సమయం మిగులుతుంది. ఇలా ఆడ్ రిక్వెస్ట్ లు చివరిలోనే ఎందుకు చూడాలో చెబుతాను. మనకి వచ్చిన స్క్రాప్స్ కి రిప్లైస్ ఇవ్వటం హడావుడి తగ్గుతుంది. మనం పాల్గొనే కమ్యూనిటీల పోస్టింగ్ లన్నీ చూశాక కాస్త రిలాక్స్ గా ఉంటాము.  అప్పుడే సరియైన నిర్ణయం తీసుకోగలం. ఆడ్ చేసుకునే ముందే అన్నీ పరిశీలించాలి. ఆడ్ చేసుకున్నాక వారి గురించి బాధపడొద్దు -అప్పుడే చూసుకొని ఫ్రెండ్ గా ఆడ్ చేసుకునేది లేకుండా ఉండెను అనీ..

No comments:

Related Posts with Thumbnails