Wednesday, February 24, 2010

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? - 2

1. ముందుగా మీరు బ్లాగుని ఏర్పరుచుకున్నాక Settings లోకి వెళ్ళండి.

2. అందులోని Toolbar లో Basic అంటూ ఒకటి ఉంటుంది. దాన్ని నొక్కండి.

3. అప్పుడు వచ్చిన పేజిలోనే క్రిందిభాగాములో ఇలా కనపడుతుంది.
4. ముందుగా Select post editor లో చూపించినట్లుగా Updated editor, Old editor అంటూ  ఉన్నాయిగా..

5. అందులో మొదటిది Updated editor ని ఎన్నుకొనండి. ఇందులో అయితే చాలా ముఖ్యమైన పనిముట్లు ఉంటాయి.

6. ఆ తరవాత Enable transliteration ఉందిగా!..

7. అందులో మొదటిగదిలో Enable అని పెట్టి, ఆ ప్రక్క గడిలో Telugu - తెలుగు అని ఎన్నుకోండి.

8. ఆతరవాత Save Settings ని నొక్కండి.

9. ఇప్పడు మీరు టపా వ్రాయటానికి మీ బ్లాగులోని New post ని నొక్కండి. 

10. ఇప్పుడు అందులో ఇలా కనిపిస్తుంది. ఇందులో చివరలో ఉన్న "అ" అక్షరాన్ని క్లిక్ చేసి, క్రింది గడిలో రోమన్ ఇంగ్లీషులో వ్రాయడం మొదలెట్టండి. అంతే!.


అంతే! ఇకనుండి మీరు మీ బ్లాగులో వ్రాసినదంతా - ఇలా వ్రాసి Spacebar నొక్కగానే తెలుగులోకి మారిపోతూ ఉంటుంది.

No comments:

Related Posts with Thumbnails