Saturday, February 7, 2009

అల్లూరి సీతారామరాజు - వస్తాడు నా రాజు ఈ రోజు..


చిత్రం : అల్లూరి సీతారామరాజు
సంగీతం: పి.ఆదినారాయణరావు
గాయకులు: పి. సుశీల
రచన: డా. సి.నారాయణరెడ్డి
చిత్రం విడుదల తేది: 1974
*****************

పల్లవి:

వస్తాడు నా రాజు ఈ రోజు - రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళలోన - కలికి వెన్నెల కెరటాల పైన
కార్తీక పున్నమి వేళలోన - కలికి వెన్నెల కెరటాల పైన

తేలి వస్తాడు నా రాజు ఈ రోజు

చరణం 1:

వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను (2)
అతని చల్లని అడుగుల సవ్వడి వీచే గాలి వినిపించేను
అతని పావన పాద ధూళికై అవని అణువణువు కలవరించేను
అతని రాకకై అంతరంగమే పాలసంద్రమై పరవశించేను (2) // వస్తాడు //

చరణం 2:

వెన్నెలలేంతగా విరిసిన గాని చంద్రుణ్ణి విడిపోలేవు
కెరటాలేంతగా పొంగినగాని కడలిని విడిపోలేవు
కలసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకు విడిపోలేవులే
తనవులు వేరైనా దారులు వేరైనా (2)
ఆ బంధాలే నిలిచేనులే ఆ.. బంధాలే నిలిచేనులే!! // వస్తాడు //

No comments:

Related Posts with Thumbnails