Saturday, February 7, 2009

ఒక్కడు - చెప్పవే చిరుగాలి చల్లగా..


చిత్రం: ఒక్కడు
సంగీతం: మణిశర్మ
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత
********************

పల్లవి:

చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఇక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళీ
ఇక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళీ చెప్పవే // చిరుగాలి //

చరణం 1:

ఆశా దీపికలై మెరిసే తారకలు చూసే దీపికలై
విరిసే కోరికలు మనతో జతై సాగుతుంటే హొ -
అడుగే అలై పొంగుతుంది ఆ…
చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ రెక్కలు విప్పుకు
ఎగిరే కళ్ళుదిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే
ఆపగలవా షికారులు కురిసే సుగంధాల హొలీ ఓ -
చూపాడా వసంతాలకేలీ కురిసే సుగంధాల హొలీ ఓ -
చూపాడా వసంతాల కేళీ చెప్పవే // చిరుగాలి //

చరణం 2:

యమునా తీరాల కధ వినిపించేలా
రాధామాధవుల జత కనిపించేలా
పాడనీ వెన్నెల్లో ఈ వేల చెవిలో
సన్నాయి రాగంలా ఓ…
కలలే నిజమై అందేలా ఊగే ఊహల
ఉయ్యాల లాహిరి తరంగాల రాతిరి
ఎదని ఈదే వేళ జాజిరి జానపదంలా
పొద్దే పలకరించాలి
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ హొ
చూపదా వసంతాల కేళి
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ హొ
చూపదా వసంతాల కేళి చెప్పవే // చిరుగాలి //

No comments:

Related Posts with Thumbnails