Sunday, February 8, 2009

Appu chesi pappu koodu - Cheyi cheyi


చిత్రం: అప్పు చేసి పప్పు కూడు (1959)
రచన: పింగళి
సంగీతం: S.రాజేశ్వర రావు
గానం: A.M. రాజా, P.సుశీల
*****************
పల్లవి:
చేయి చేయి కలపరావె హాయి హాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా..
చేయి చేయి కలపరావె హాయి హాయిగా

నదురు బెదురు మనకింక లేదు లేదుగా..
ఆహా ... చేయి చేయి..
పెద్దవారి అనుమతింక లేదు లేదుగా చేయి చేయి
కలుపుటేలా హాయి హాయిగా..
పెద్దవారి అనుమతింక లేదు లేదుగా చేయి చేయి

కలుపుటేలా హాయి హాయిగా..
ఉహు.. చేయి చేయి..

చరణం 1:
మగని మాటకెదురాదుట తగదు తగదుగా
నాతి చెంత విరహము నే తాలలేనుగా..
మగని మాటకెదురాదుట తగదు తగదుగా
నాతి చెంత విరహము నే తాలలేనుగా..
అహ.. చేయి చేయి..

చరణం 2:
వీలు కాని విరహమింక వలదు వలదుగా
దాసి మీద వలపు మీకు తగదు తగదుగా... 
వీలు కాని విరహమింక వలదు వలదుగా
దాసి మీద వలపు మీకు తగదు తగదుగా... //చేయి చేయి //

No comments:

Related Posts with Thumbnails