Saturday, February 7, 2009

తులసి - వెన్నెలింత వేడిగా..



చిత్రం: తులసి (2007)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
 గాయకులు: వేణు, సునీత
రచన: చంద్రబోస్
చిత్రం విడుదల తేది: 12 అక్టోబర్, 2007
*****************


పల్లవి:

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా!
చేదు ఇంత తియ్యగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా!
చీకట్లో సూరీడు పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే నువ్వే నవ్వంగా
నేలపై మేఘాలూ ఆకాశంలో గోదావరి చేరాయే నువ్వు చూడగా // వెన్నెలింత //


చరణం 1:

నా పేరే అనుకుంటూ నీ పేరు నేను రాసానే
నా రూపే అనుకుంటూ నీ రూపు నేను గీసానే
తీయంగా దీర్ఘంగా ఏదో ఏదో అవ్వంగా ప్రేమంటూ కానే కాదంట
మెత్తంగా కొత్తంగా ప్రేమను మెచ్చే మనమింకా మనజంటే కనిపెట్టాలంటా // వెన్నెలింత // 


చరణం 2:

గాలైన నిన్ను చుడితే ఎనలేని ఈర్ష్య కలిగిందే
నేలైనా నిను తడితే ఎదలో అసూయ కలిగిందే
గాడంగా గర్వంగా జోడి మనమే కట్టంగా ఏడే జన్మలు సరిపోవంట
దేవుళ్ళే మనకోసం పగలు రేయి పనిచేసి ఎన్నోజన్మలు సృష్టించాలటా // వెన్నెలింత //

No comments:

Related Posts with Thumbnails