Friday, February 6, 2009

మూగ మనసులు - పాడుతా తీయగా చల్లగా...



ఈ పాటలోని పదాలు - పాటయాస లోనే రాయడం జరిగింది.
చిత్రం: మూగ మనసులు (1964)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి.మహదేవన్
గానం: ఘంటసాల
****************


పల్లవి:

పాడుతా తీయగా సల్లగా... పాడుతా తీయగా సల్లగా
 పసిపాపలా నిదురపో తల్లిగా - బంగారు తల్లిగా
పాడుతా తీయగా సల్లగా

చరణం 1:

కునుకుపడితె మనసు కాస్త కుదుటపడతది
కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది (2)
కలలే మనకు మిగిలిపోవు కలిమి సివరకూ (2)
ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకు? // పాడుతా తీయగా //

చరణం 2:

గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్లు
ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు (2)
పోయినోళ్ళు అందరూ.. మంచోళ్ళు (2)
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు // పాడుతా తీయగా //

చరణం 3:

మణిసిపోతే మాత్రమేమి మనసు ఉంటదీ
మనసుతోటి మనసెపుడో కలసిపొతది (2)
సావుపుటక లేనిదమ్మ నేస్తమన్నదీ (2)
జనమజనమకది మరి గట్టిపడతది // పాడుతా తీయగా //
Related Posts with Thumbnails