Tuesday, December 6, 2016

Good Morning - 622


ఎలా మాట్లాడాలో నేర్చుకోవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. 
ఎలా మాట్లాడకూడదో నేర్చుకోవటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. 

అవును.. మనం మాటలు నేర్చుకోవటానికి కొన్ని సంవత్సరాలు మాత్రమే పడుతుంది. ఈ నేర్చుకోవడం అనేది తల్లితండ్రుల వద్దనో, గురువుల వద్దనో, ఇరుగు పొరుగు వారి వద్దనో, స్నేహితుల వద్దనో, శిక్షణా సంస్థలలోనూ... కొద్దికాలంలోనే నేర్చుకోవచ్చు. మనకున్న ప్రతిభని బట్టి ఆ నేర్చుకోవడం ఎంతకాలం అన్నది ఆధారపడిఉంటుంది. ఏకలవ్యుడు, స్వామీ వివేకానంద.. లా అనతికాలంలోనే నేర్చుకోవచ్చును. 

ఎలాంటి మాటలు మాట్లాడకూడదో  నేర్చుకోవటానికి మాత్రం అనేకానేక సంవత్సరాలు పడుతుంది. ఒక్కోసారి జీవితకాలం కూడా సరిపోదేమో.. ఈ మాట్లాడకూడని దాంట్లో - ఎక్కడ, ఏ సందర్భములో, ఎవరి వద్ద ఎలాంటి మాటలు మాట్లాడకూడదో నేర్చుకోవడానికి  శిక్షకులు ఎవరూ ఉండరు.. పరిస్థితులూ, జీవితం తప్ప. ఈ రెండూ అనుభవం తర్వాతే తెలియచేస్తాయి. ఆ తెలుసుకోవడం అన్నది కూడా మనంతట మనమే నేర్చుకోవాలి గానీ ఇలా నేర్చుకోమని ఎవరూ చెప్పరు. ఇంత జరిగినా ఆ పాఠాలని  చాలామంది నేర్చుకోరు. బలమైన దెబ్బ తలిగి ఏదోకటి కోల్పోయేదాకా ఆ పాఠంని పట్టించుకోం.. ఇలా ఒక్కొక్కటీ నేర్చువటానికి చాలాకాలమే పడుతుంది. కారణం : వీటి గురించి చెప్పేవారు లేకపోవడం.. పెద్దవారు చెప్పటానికి సిద్ధముగా ఉన్న వినేంత ఓపిక, ఆసక్తీ, సమయం నేటి యువతకు లేదు.. ఎవరి బీజీ వారిది. 


No comments:

Related Posts with Thumbnails