Wednesday, July 23, 2014

Orkut 2

http://achampetraj.blogspot.in/2014/07/orkut.html తరవాయి..

ఆర్కుట్ సోషల్ సైట్ వారు మనకొక అద్భుత అవకాశాన్ని ఇచ్చారు. ఆ సైట్ లో మనం వ్రాసిన, పోస్ట్ చేసిన, కామెంట్ చేసిన వాటన్నింటినీ అచ్చు అలాగే - అంటే మనం అక్కడ పాల్గొన్నప్పుడు ఎలా అక్కడ కనిపించిందో, అచ్చు అలాగే మనకి కనిపించేలా, మళ్ళీ మళ్ళీ మనం వ్రాసినదీ చూసుకొనేలా ఏర్పాటు చేశారు.

నమ్మశక్యముగా లేదు కదూ.. కానీ అది నిజమే. ఎలాగూ సైట్ మూసేస్తున్నాం కదా.. ఇక అందులోని సభ్యుల భావాలు, జ్ఞాపకాలని అలా కాలగర్భములో కలిపేయకుండా, డౌన్లోడ్ చేసుకొనే ఆప్షన్ ఇవ్వడం వల్ల ఆ సైట్ బాధ్యాయుతముగా ప్రవర్తించిందనే చెప్పాలి. అందులకు వారిని అభినందిస్తున్నాను.

ఇలా చెయ్యడం నాకు ఎంతగానో నచ్చేసింది. ఎంతగానో కష్టపడి క్రియేట్ చేసిన ( కాపీ పేస్ట్ చేసినవీ ) వాటన్నింటినీ పొందటం ఒకరకముగా అదృష్టమనే చెప్పాలి. బాగా నచ్చిన వాటన్నింటినీ కాపీ చేసుకోవాలంటే ఎంత కష్టం ? కాపీ చెయ్యాలనుకున్నా ఎలా చెయ్యాలో చాలామందికి తెలీదు. అందరూ టెక్నో సావీలు కారు కదా.. సాంకేతికముగా అందరూ ఫుల్ పర్ఫెక్ట్ అయి ఉండరు కదా..

స్క్రీన్ షాట్స్ తీసుకొని భధ్రపరచుకోవాలనుకున్నా, అదెలా చెయ్యాలో కూడా తెలీదు. ఒకవేళ చెయ్యటం వచ్చినా - మానిటర్ సైజు బాగుండాలి. వాటన్నింటినీ అలా చేసుకొనే ఓపిక ఉండాలి. అలా ఎంతమందికి ఉన్నది అన్నది లెక్కిస్తే సమాధానం దొరకకపోవచ్చును.

అందమైన, వెలకట్టలేని అనుభూతులని ఇచ్చిన ఆర్కుట్ వారే - కాస్త పెద్దమనసు చేసుకొని, వాటన్నింటినీ ఒక ఫోల్డర్ గా డౌన్ లోడ్ ఆప్షన్ గా ఇవ్వటం చాలా మంచి ఐడియా. యే సభ్యుల వల్ల తమ సైట్ ప్రఖ్యాతి చెందిందో, వారి ఋణాన్ని తిరిగి చెల్లించేసుకోవడం అన్నది ఇలాగ కూడా కావచ్చన్నది - నా అభిప్రాయం.

ఈ డౌన్ లోడ్ ఆప్షన్ లేకుంటే - జీవితాన జరిగిన కొన్ని మధుర క్షణాలని మనసు పొరల్లోనే దాచుకోకుండా ఇలా మన కంప్యూటర్ లలో దాచుకొని, అప్పుడప్పుడు ఫోటో ఆల్బమ్ లా చూసుకోనేలా వీలు కల్పించడం చాలా చాలా మంచి ఆలోచన. ఇందులకు ఆ ఆర్కుట్ ( గూగుల్ ) వారికి నేను ఎంతగానో ఋణపడి ఉంటాను.

ఇక ఆ ఆర్కుట్ ప్రొఫైల్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో త్వరలోనే వివరముగా చెబుతాను. అంతవరకూ వేచి చూడండి.

ఇంకా వుంది. 

No comments:

Related Posts with Thumbnails