Thursday, December 5, 2013

Good Morning - 513


ఒక్కోసారి జీవితమే మనకు ముఖ్యమైన పాఠాల్ని నేర్పుతుంది - 
అదీ ఎటువంటి ట్యూషన్ ఫీజు లేకుండా.. 
మీ దగ్గర ఏమి లేదో దాని గురించి బాధపడకండి. 
మీ దగ్గర ఏమున్నదో దాని గురించి సంతోషించండి. 

హ్మ్!.. మనకి మనం అనుభవాల వల్లనో, మరే ఇతరత్రా వల్లనే గానీ.. ఎన్నో పాఠాలని నేర్చుకుంటాం. దాని వల్ల మన జీవన పోకడ ఏమిటో తెలుసుకుంటాం. ఒక్కోసారి మన జీవితమే మనకు ఎలాంటి గురువు భత్యము లేకుండానే అంటే ఉచితముగా ఎన్నో ముఖ్యమైన పాఠాలని నేర్పిస్తుంది. అదీ మానసికముగా బాగా దెబ్బ తిన్నప్పుడు. ఆ పాఠాల వల్ల మనం బాగానే నేర్చుకుంటాం. ఇతరులకి జరిగినప్పుడు కన్నా - మనకి జరిగినప్పుడు ఆ పాఠాలు బాగా బుర్రకేక్కుతాయి. 

మన దగ్గర ఏమి లేదో దాని గురించి, బాధ పెట్టేసుకోకండి. లేని దాని గురించి ఇంత బాధ పెట్టుకుంటే - అంత అది మనకి చెందుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు. అలాని ఎవరూ, ఎక్కడా, ఎప్పుడూ హామీ ఇవ్వలేదు.. ఇవ్వరు కూడా. లేనిది ఎప్పుడూ లేనిదే. దానిని పొందడానికి శాయశక్తులా ప్రయత్నించాలి కానీ, లేదని బాధ పెట్టుకుంటే, బాధే మిగిలిపోతుంది. ఆకాశాన నక్షత్రాలు కనిపించటం లేదని బాధ పడితే, అనక వచ్చే కన్నీళ్ళ వల్ల - కనిపించే చంద్రుడు కూడా కనిపించకపోయే ప్రమాదం ఉంది. 

మన దగ్గర ఏముందో, అవి ఏమిటో క్షుణంగా ఆత్మావలోకనం చేసుకోవాలి. ఉన్న చెడు లక్షణాలన్నింటినీ తొలగించుకొనే ప్రయత్నం చేసి, ఆ స్థానములో మంచి లక్షణాలని ఉంచుకోనేలా చెయ్యగలగాలి. మనలో ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయో, మన స్వంతం అనుకున్నవి ఏమున్నాయో  వాటిని ఆస్వాదించడం నేర్చుకోండి. మన దగ్గర ఏమీ లేవు అని అనుకొని వెంపర్లాడే బదులు, ఉన్నవాటినే ఆనందించడం చెయ్యాలి. ఇలా చెయ్యాలంటే ఒక దగ్గర దారి ఉంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు - మనలోపాలని సహేతుకముగా విమర్శించి, వాటిని ఎలా తొలగించుకోవాలో, వాటి స్థానాన ఏమి మార్పులు రావాలో - ధైర్యముగా మనకు చెప్పగలిగే స్నేహితుడు మనకు ఒక్కరైనా ఉండాలి. మన మాటలకు ( అవసరార్థం ) భజన చేసేవారు ఎందరున్నా, మన జీవితం ఏమీ మారదు. పైగా మనమే మోసపోతాం కూడా. 


No comments:

Related Posts with Thumbnails