Sunday, May 6, 2012

తన నంబర్ చెబుతారా?

ఆమధ్య ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాను. తను ఇంకో మిత్రుడిని పరిచయం చేస్తాను అని చెప్పారు. తనకోసం వెయిటింగ్ చేశాం. నా ఫ్రెండ్ లోపలి గదుల్లోకి వెళ్ళినప్పుడు - ఆ క్రొత్త ఫ్రెండ్ వచ్చాడు.

నేను, తను ఒకళ్ళని ఒకరు చూసుకోవటం అదే తొలిసారి. ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ వచ్చాడు. తను వచ్చింది చూసి, సోఫాలో కూర్చున్నవాడిని, లేచి విష్ చేశాను. హ్మ్! రెస్పాన్స్ లేదు. నా విష్ సరిగా వినపడలేదేమో అనుకున్నాను. ఫోన్ అయ్యాక కేవలం అడుగు దూరములో ఉన్న నన్ను కనీసం చూడకుండానే, భోజనానికి కూర్చున్నాడు. నా మనసులో ఏదో అనుమానం. కానీ పరిచయం ఏమీ లేదు గనుక, అలా ప్రవర్తించి ఉండొచ్చును అనుకున్నాను.

భోజనాలు చేసేటప్పుడు - నా ఫ్రెండ్ తనకి పరిచయం చేశారు. అప్పటినుండి చిన్నగా మాటలు మొదలయ్యాయి. కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు అయ్యాక, సోఫాలో చేరగిలి, కబుర్లు మొదలెట్టాం. నా విష్ కి బదులు ఇవ్వలేదు అనే విషయమే మరిచాను.

కబుర్ల మధ్యలో - అవీ, ఇవీ విషయాలు చర్చకి వచ్చాయి. ఎక్కువగా నా స్వవిషయాలు. పరిచయాల మొదట్లో అవి కామనే కదా.. అలా సాగుతున్న మా మాటల మధ్య అకస్మాత్తుగా జేబులోనుండి ఆపిల్ ఐ ఫోన్ 4S మాడల్ ఫోన్ తీసి, నాకు చూపిస్తూ, ఫోన్ లాక్ ఓపెన్ చేసి కీ ప్యాడ్ ఓపెన్ చేసి - " వారి (XYZ) ఫోన్ నంబర్ మీ దగ్గర ఉందా? తన నంబర్ చెబుతారా..? " అడిగాడు. ఆ ఆడగటం కూడా ఒక స్పెషల్ గా అడిగాడు. ఎలా అంటే - తను వచ్చేటప్పుడు రెండు ఫోన్ యూనిట్స్ పట్టుకోచ్చేశాడు. ఒకటి బయట పెట్టాడు. వచ్చేముందు ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చాడు అన్నాను కదా.. ఆ ఫోన్ తోనే. అది Wynncom డబల్ సిమ్ ఫోన్. ఫోన్ నంబర్ ని అందులో అయినా ఫీడ్ చేసుకోవచ్చును కదా.. ఏం! అందులో అలా ఫీడ్, కాల్ చేసుకోరాదా?

నేను షాక్ అయ్యాను. నిజానికి ఆ ఒకరు తనకి తెలుసు, వారి ఫోన్ నంబర్ తన దగ్గర ఉండొచ్చు, లేదా మా ఫ్రెండ్ దగ్గర మాత్రం ఖచ్చితముగా ఉంది కూడా.. తన దగ్గర తీసుకోవచ్చును కదా.! అయినా నన్ను అడగటం ఏమిటీ?. అయినా ఆ ఫ్రెండ్ అంటే వారికి గిట్టదు కూడా. ఒకప్పుడు వారి దగ్గరి ఫ్రెండ్, కొద్దినెలల తరవాత విడిపోయారు కూడా. ఆ XYZ ఫోన్ నంబర్ నా దగ్గర ఉందని నన్ను అడగటం ఎందుకూ..?

నా మొబైల్ లో ఆ నంబర్ ఉంది. ఒకే ఒకసారి ఆ నంబర్ కి కాల్ చేశాను అని నా ఫ్రెండ్ తో చెప్పాను కూడా. మళ్ళీ ఇంతవరకూ మళ్ళీ ఆ నంబర్ వాడలేదు. ఫోన్ తీయబోతూ, ఆగిపోయాను. ఎందుకో మనసు వద్దంది. ఆగిపోయాను. వెంటనే తేరుకొని " ఆ నంబర్ నా మొబైల్ లో ఫీడ్ లేదు. మెయిల్ లో ఉంది, అందులోంచి చూసి, చెయ్యాలి.." అబద్ధం చెప్పాను. ఆ ఒక్క క్షణం లోనే చాలా ప్రశ్నలు ఉదయించాయి.

తన నంబర్ ఇస్తే - ఇతడికీ, వారికీ ఇంతకు ముందే గొడవలు ఉన్నాయి. మళ్ళీ గొడవలు మొదలవటానికి, నేనే కారణం అవుతానేమో. 


ఆ నంబర్ ఇచ్చారు నాకోసం అనీ. నేనూ ఆ ఇచ్చినప్పుడు సమయం లోనే ఒకేఒకసారి కాల్ చేసి మాట్లాడాను. మళ్ళీ ఇక మీకు ఎన్నడూ కాల్ చెయ్యను. చేసేలా చెయ్యకండి. ఈ కాల్ లోనే అన్నీ అడిగేయ్యండి.. అనే కండీషన్ మీద అయితేనే మాట్లాడటానికి నేను ఒప్పుకున్నాను. వీరికేలా ఇవ్వగలను?.


ఒకవేళ ఇస్తే, అలా అలా చేతులు దాటి, తుంటరి చేష్టతో తనని ఇబ్బంది పెడితే.. చివరకి ఈ ఫోన్ నంబర్ మీకు ఎలా వచ్చింది అంటే చివరకి నా పేరు వస్తుంది. అప్పుడు నాకు ఉంటుందీ - ఒక పెద్ద తలనొప్పి. 


అయినా తన నంబర్ వారి దగ్గర ఉన్నా నన్నే అడగటం ఎందుకూ..? నా ఫ్రెండ్ కూడా ఏమీ మాట్లాడక పోయేసరికి, అలా అడగటములో వాడికీ అందులో భాగం ఉందా? 


అయినా అంతా గొడవలన్నీ ముగిసి, ప్రశాంతముగా ఉన్న సమయాన, మళ్ళీ ఆ XYZ ఫోన్ నంబర్ ఎందుకూ..? 


అయినా Wynncom డబల్ సిమ్ ఫోన్ ప్రక్కన ఉన్నా, ఆ ఆపిల్ ఐ ఫోన్ అప్పుడే తీసి, నాకు చూపిస్తూ అందులోంచి కాల్ చెయ్యాలని చూడటం ఏమిటీ? ఆ ఇంకో ఫోన్ లో బ్యాలన్స్ లేదా?.. అలా లేనప్పుడు ఆ ఐ ఫోన్ కూడా ఎందుకో! 


లేదా - నాది లేటెస్ట్ ఆపిల్ ఐ ఫోన్ స్టాండర్డ్ నాది.. చూశావా అని ఫోజా? 


అలా నంబర్ అడిగి, నీ ఫోన్ ని చూసి, నీ (ఆర్ధిక) స్టాండర్డ్ ఏమిటో చూస్తాను అనా?.. నాకు మాత్రం ఇదే కరెక్ట్ అనిపించింది. 

ఇక అర్థం అయ్యింది.. ఇక తనని మా ఫ్రెండ్ పరిచయం చేసినా - అది ఆర్ధిక అసమానతలు అనే పునాది మీద పరిచయం అయిన స్నేహం కాబట్టి, ఎక్కువ రోజులు సాగదు తెలిసిపోయింది. తనకి పరిచయం చేసిన మా ఫ్రెండ్ ఫీల్ అవుతాడని, తన కోసం అనీ, పైపైకి నటిస్తూ, వేసే జోకులకు నవ్వుతూ, బాగా క్లోజ్ అన్నట్లు ఉండిపోయాను. చాలా సంవత్సరాల తరవాత స్నేహితుల వద్ద నటించాల్సివచ్చింది. నా మనస్సుని రెండుగా చేశాను. పైకి అతనితో, ఏమీ కల్మషం లేకుండా నవ్వుతూ ఉన్నట్లు ఉన్నా, లోపల మాత్రం తను అనే మాటలు వెనక ఉన్న గోతులను, అంతరార్థాలని గమనిస్తున్నాను. ఆ సంఘటన తరవాత ఇక ఎక్కడా ఇబ్బంది పెట్టుకోలేదు. పడలేదు. చాలా కూల్ గా ఉండిపోయాను. చాలా చోట్ల ఇరుక్కునే మాటలు వచ్చాయి కానీ, నా జాగ్రత్త వల్ల ఎక్కడా వారి వలలో పడలేదు. అన్నీ తెలుస్తూనే ఉన్నాయి కదా.. తన ఆలోచనలు అన్నీ.

అలా మాట్లాడేసి, బయటకి వచ్చేశాను. ఈ విషయం నా ఫ్రెండ్ కి ఇంతవరకూ చెప్పలేదు. స్నేహ ధర్మాన్ని పాటించాలి కదా.. ఒకరి మీద చెబితే నాకు వచ్చేది ఏముందీ..? నేను అంచనా వేసినట్లే - నా మీద ఏదో చెప్పేశాడు. నానుండి దూరం అయ్యాడు. ముందే ఊహించాను కాబట్టి మామూలుగానే ఉన్నాను. ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోయినా ఏమీ బాధ లేదు.

మొత్తానికి స్థూలముగా ఆలోచిస్తే - కొన్ని విషయాలు స్పష్టం అయ్యాయి నాకు.

నంబర్ ఇస్తే - వారు ఎప్పుడైనా - తానే మాకు నంబర్ ఇచ్చాడు అని ఆ XYZ తో అంటే ఇక నా పని అవుట్. 


తనని వీరు ఏమైనా ఇబ్బంది పెడితే, ఈ గ్యాంగ్ లో ఆ (పర్సనల్) నంబర్ నాకొక్కడికే తెలుసు. కనుక ఎటొచ్చీ నేనే దొరికిపోతాను. 


ఎంత కాస్ట్లీ ఫోన్ వాడితే - అంత రిచ్ పర్సనా?.. కొద్దిరోజులకి క్రొత్త మాడల్స్ వస్తూనే ఉన్నాయి. అప్పుడు అవి ఉన్నవారే ధనవంతులా?.. 


తన నంబర్ మొబైల్ లో ఫీడ్ అయ్యి ఉంది, వీలున్నప్పుడల్లా మా ఫ్రెండ్ విషయాలు నేనే చేరేస్తున్నాను అని సాక్ష్యాధారాలతో తనముందు నన్ను దోషిగా నిలబెట్టాలనా?. 


ఇలా నీ శత్రువు ఫోన్ నంబర్ మొబైల్ లో ఫీడ్ చేసుకున్నాడు.. మా మొబైల్స్ లో ఆ నంబర్ లేదు తనతో అంటే - తన శత్రువులతో కూడా నేనే సఖ్యముగా ఉంటున్నాను అని సాక్ష్యముగా చూపటానికా? 


ఇలాంటివాడితో ఇంకా ఎలా స్నేహం ఎలా చేస్తున్నావు అని అనడానికా?.. 


పోనీ నేనే కాల్ కలిపించి ఇచ్చినా, "చూశావా! ఫోన్ నంబర్ ఎలా దాచుకున్నాడో, ఎలా కలిపి మాట్లాడనిచ్చాడో, అంటే వారిద్దరి మధ్య మాటలు కొనసాగుతున్నాయన్నమాట.. " అని సాక్ష్యముగా చూపటానికి కావచ్చును. 


లేదా మాట్లాడించినా - రాజ్ నా దగ్గర తన నంబర్ ఉంది, మాట్లాడుతారా? అని అంటే మాట్లాడుతున్నా.." అని ఆ XYZ తో అంటే - ఇక నా విలువ ఏముంటుంది. ఎలా ఆలోచించినా నిండా మునిగేది నేనే.. 

ఇలా చాలా అర్థాలు వచ్చాయి. మొత్తానికి ఆరోజు గండం దాటాను. ఆ నూతన మిత్రుడి తొందరపాటు తనం వల్ల - ఎటువంటి చిక్కులు ఎదురుకోలేదు. నేను గనక తనని నమ్మి నంబర్ చెప్పేసి ఉంటే - కథ ఇంకోలా ఉండేది. నేనే అందరి ముందు దోషిలా నిలబడేవాడిని.

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే - ఒక వ్యక్తిని కాసింత పరిశీలన చేస్తే, మనం చాలా చిక్కులనుండి ముందే బయటపడొచ్చును అనీ. తగు జాగ్రత్తలు తీసుకోవచ్చనీ.. ఎన్నెన్నో చిక్కు సమస్యల నుండి మనల్ని రక్షిస్తుంది అంటే ఒక చిన్న అబద్ధం ఆడటం తప్పులేదు. 

8 comments:

శ్యామలీయం said...

మంచి విషయాలు చర్చించారు.
అందరూ ముఖ్యంగా గమనించ వలసినది యేమిటంటే, మీ దగ్గర ఉన్న యెవరి సమాచారం (చిరునామా, ఫోన్ నెంబరు వగరా) అయినా వారి అనుమతి లేకుండా ఇతరులకు ఇవ్వటం మంచి పధ్ధతి కాదు. నిర్మొగమాటంగా సందర్భాన్ని బట్టి, సమాచారం మీ దగ్గర లేదనో, ఇవ్వలేననో, అడిగి ఇస్తాననో చెప్పండి. అంత్యనిష్టూరం కన్నా ఆదినిష్టూరం చాలా మేలు కదా!

Sudha Rani Pantula said...

వారిజాక్షులందు, వైవాహికములందు, ప్రాణ విత్త మాన భంగమందు.....బొంక వచ్చు..అఘముబొందడధిప!! - భాగవతమే చెప్పింది. కానీండి మరి.

rajasekhar Dasari said...

వాళ్ళు అడిగే దాకా ఎందుకు , ఫోన్ చేయగానే మొదట చెప్పే పేరు మీదే , నీ నెంబర్ నా దగ్గర లేదు ఫలానా ఆయన ఇచ్చాడు అనే సంభాషణ మొదలుపెడతారు.

Raj said...

అవునండీ.. అలాగే చెబుతారు. నేను అనుకున్నది / చేసినది సరియైన పనే అన్నమాట.

Raj said...

అవునండీ సుధా గారూ.. కృతజ్ఞతలు..

Raj said...

అవునండీ శ్యామలీయం గారూ.. ఇతరులవి వేరేవారితో అసలు పంచుకోవద్దు.

rajachandra said...

Nijame.. vari madya sanbandalu ela unnayo makani teliyanappudu.. avatalavari vishayalanu (cell number) iste book ayyedi maname.. anta bagunnanta kalam .. bagane untundi teda vaste..

Raj said...

అంతే కదా రాజ చంద్ర గారు!.. బాగున్నని రోజులూ ఏమీ కాదు. ఆ తరవాత ఇక ఉంటుందీ - ఎందుకలా చేశామురా భగవంతుడా.. అని బాధ పడాలి.

Related Posts with Thumbnails