Tuesday, August 30, 2011

Social NW Sites - 37 - Post Scripts - 4

పొరబాట్లు మానవ సహజం.. అంతే కాని చిన్న చిన్నపోరబాట్లకి దూరం చేసుకోవటం అంత మంచిది కాదు. క్రొత్తగా ఆడ్ అయిన వారి విషయములో అయితే కాస్త ఓకే అనుకోవచ్చును. అప్పటికి పరిచయం లెవల్లో ఉంటుంది కాబట్టి ఏమీ ఇబ్బందిగా ఉండదు. కాని పాత / చాలా కాలముగా సాగి స్నేహముగా మారినప్పుడు - అలా చేస్తే చాలా బాధగా ఉంటుంది. అది మీకే కాదు. అవతలివారికీ అలాగే ఉంటుంది. రేప్రోద్దున తను దూరం అయినా ఒక మంచి రీజన్ అంటూ ఉండాలి.

మీకేదైనా ఇబ్బందిగా అవతలి వారి ప్రవర్తన ఉన్నదే అనుకోండి. వారికే చెప్పండి ఇలా మీ అనడం నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. దయచేసి మళ్ళీ అనకండి అనీ.. బహుశా ఇక మీకు అలాంటి ఇబ్బంది రాకపోవచ్చును. ఒక చిన్న మాట (క్షమించండి అనే మాట ) మనల్ని చాలా ఇబ్బందుల్లోంచి బయటకి లాగుతుంది. అదే ఒక చిన్న మాట బాగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కనుక ఎలా వ్యవహరించాలో కాస్త రోజురోజుకీ నేర్చుకుంటూ ఉండండి.

పొరబాట్లు తెలిసో, తెలీకో అందరూ చేస్తారు. దాన్నే హైలెట్ చేసి చూస్తే - అంతా అదే కనిపిస్తుంది. స్నేహం అన్నప్పుడు అవన్నీ మరచిపోవాలి. కొన్నిసార్లు మరచిపోలేక పోవచ్చును. కానీ అవతలివారు సారీ చెప్పాక కూడా ఇంకా మనం అలాగే మన కోపాన్ని కొనసాగించటం అంత మంచిది కాదు. ఈ కోపాలు క్షణికం. వెంటనే సర్దుక పోవటం మరీ మంచిది. నిజానికి స్నేహం అంటేనే అదే కదా.. కావాలంటే - మీరొకసారి "హ్యాపీడేస్" సినిమా మరొకసారి చూడండి. అందులో రాజేష్ స్టాలిన్ తో "ఆ శంకర్ ని నమ్మకురా.. వాడు ఏదో ఒక రోజు నిన్ను మోసం చేస్తాడు.." అంటాడు. తనని మోసం చేస్తున్నాడు అని ఆ స్టాలిన్ కి తెలిసినా "ఎంతైనా మన ఫ్రెండ్ యే కదరా.." అని అంటాడు. అదీ స్నేహం అంటే. ఇక్కడ చెప్పే పాయింట్ ఏమిటంటే - మనసారా మన్నించటం - అదే స్నేహ ధర్మం. అంతే!.

దైనా పొరా పొచ్చాలు వస్తే అప్పుడే తేల్చేసుకోవాలి. కాని ఎప్పటి విషయమో, ఎప్పుడో అడిగితే అది బాగనిపించుకోదు. సంఘటన జరిగిన క్రొత్తల్లోనే అలా చెయ్యటం మంచిది. దాన్ని అలా సాగదీయటం అంత మంచిది కాదు. ఏదైనా సందేహం వస్తే, అప్పుడే అడగాలి. కాని ఆ తరవాత అడిగితే - ఈ ప్రశ్నని, ఆరోజే ఆ టాపిక్ వచ్చినప్పుడు అడిగితే అయిపోయేదిగా, ఇన్నిరోజుల తరవాత అడగటం ఏమిటీ? అప్పుడే ఎందుకు అడగలేదు? అంటే ఇంతకాలానికి ఆ ప్రశ్న వచ్చిందంటే ఈ మధ్యనే ఏమో జరిగింది అన్నమాట.. అని అవతలివారు అంటే ఏమీ చెయ్యలేకపోతాం.

లాంటి విషయం ఒకటి చెబుతాను. నేను ఒకతన్ని ఆడ్ చేసుకున్నాను. కొద్దిరోజుల తరవాత అతని పద్దతి నచ్చక రిమూవ్ చేశాను. ఎందుకు అలా చేశానో కూడా చెప్పి, అలా చేశాను. అయినా అతను మారలేదు. చాలా నెలల తర్వాత నన్ను అడిగాడు. నేను అప్పటికే అంతా మరిచాను. అయినా గుర్తుచేసుకొని చెప్పాను. ఇప్పుడు ఆడ్ చేసుకోమని అన్నాడు. ఇంకా మారలేదు మీరు కూల్ గా అన్నాను. దానికి ఆవేశముగా - చాలా చెడ్డగా - మీకు ఆడవారు అంటే ఇష్టం.. వారికే రిక్వెస్ట్ పెడతారు.. వారితోనే మాట్లాడుతారు.. వారితోనే షేర్ చేస్తారు.. అంటూ చాలానే అన్నాడు. అయినా కూల్ గా సమాధానం ఇచ్చాను. అప్పుడు అతను చెప్పింది నిజమా కాదా అని చూశాను. అదేమీ లేదు. నా ప్రొఫైల్ లో 32 % మహిళలు. (అలా అన్నాకే తొలిసారిగా లెక్కపెట్టాను.) ఇలా ఏవేవో మాట్లాడుతారు కొందరు.. కాని అవి నిజాలయితేనే ఏమైనా ఫీల్ అవండి. లేదా వారినీ, వారి కామెంట్స్ నీ మరచిపోయి హాయిగా ఉండండి. మనం బాగుంటే - ఇలా ఊహించని మాటలు కూడా పడాల్సి ఉంటుంది. ఎప్పుడూ పూలే కాదు, ఒక్కోసారి రాళ్ళూ పడతాయి. అయినా తట్టుకోక తప్పదు. అదేకదా జీవితం.  మీరు మాత్రం - ఇక వారితో వాదం పెట్టుకోకుండా ఉండండి. వారు కూడా - వారు ఆ విషయములో కరెక్ట్ గా ఉండి, ఇంకొకరిని అంటే మరీ బాగుంటుంది.

తని టాపిక్ చెప్పానుగా.. ఈ టాపిక్ వ్రాస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఒకతని ప్రొఫైల్ లో అయితే అంతా మహిళలే (60 కి పైగా), ఒక్క మగవాడూ లేరు అందులో, నాకు ఆడ్ రిక్వెస్ట్ వస్తే ఎవరాని చూశాను. ఆ రిక్వెస్ట్ ని ఒప్పుకొని ఉంటే ఆ ప్రొఫైల్ లోకి చేరే మొట్ట మొదటి మొగవాడిని నేనే అయ్యుండేవాడిని. హ ఆహా హ్హా.. కాని డిటైల్స్ లేవు కాబట్టి ఒప్పుకో బుద్ధి కాకుండా, రిజెక్ట్ చేశాను. ఈ ప్రొఫైల్ ఆ అబ్బాయికి కనిపించి, ఏమైనా అడగాలని అనుకుంటే ఏమని అంటాడో ఇక.. హ అహహా  (ఇలాంటి ఆసక్తికర విషయాలూ ఉన్నాయి. అయినా ఎవరిష్టాలు వారివి.)

క్కడ ఎవరు ఎవరికీ నీతులు చెప్పరు. "..ఇలా మీకు సమస్య రావచ్చును.. మీరు అలా చేస్తే గొడవల్లోకి వెళ్ళిపోవచ్చును.. ఆ ప్రొఫైల్ వారితో ఇలా ఉండకండీ.." అని కూడా చెప్పరు.. అన్నీ మీరంతట మీరుగా నేర్చుకోవాల్సిందే! అలాని నేర్చుకోవటములో సమయాన్ని వృధా చెయ్యకండి. అయినా అలాని చెప్పగానే వెంటనే నమ్మేయకండి. అన్నీ నిజాలు కాకపోవచ్చును. అవతలివారికీ బలమైన కారణాలు, ఆధారాలు ఉండొచ్చును. అందుకే ఒకరి మాటలు విని ఎన్నడూ ఒక నిర్ణయానికి రాకండి. అలా వచ్చేసి దూరం కాకండీ..

(సశేషం...)

No comments:

Related Posts with Thumbnails