Friday, August 26, 2011

Social NW Sites - 35 - Post Scripts - 2

సోషల్ సైట్లలో మీకు మీరుగా బ్రాండింగ్ పేరు తెచ్చుకోవాలి. ఎవరిదో సినిమా నటుల ఫొటోస్ పెట్టుకొని మీరు పాపులారిటీ సాధిస్తే దానివల్ల మీకు వచ్చేదేమీ ఉండదు. ఆ సినీ నటుల వారికి జీతం లేని పనివారుగా పనిచెయ్యటం తప్పితే. అదే సమయములో మీరు మీ ఫోటో పెట్టుకొని ఒక బ్రాండ్ గా ఎదగటం, మీకు కాస్తో, కూస్తో లాభముగా ఉంటుంది. మీరు మీకుగా ఈ లోకానికి మీరు పరిచయం చేసుకున్నవారుగా ఉంటారు.

మధ్య ఉద్యోగాలలో - మీకు ఏమైనా సోషల్ సైట్లలో అక్కౌంట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. అలాని ఎందుకు అంటే - మీలోని ప్రతిభ ఎలా ఉందో, ఎవరితో ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవటానికి అలా అడుగుతున్నారు దానివల్ల మీలోని ఎదుటివారి మన్నన, వ్యవహరించే తీరు, మీ ఇష్టాలు, అయిష్టాలు.. మీరు కమ్యూనిటీలో ఎలా పాల్గొంటున్నారు, అక్కడ ఎలా చర్చ చేస్తున్నారు... ఇత్యాది వివరాల మీద కాస్త పరిశీలిస్తే మీ గురించి కాస్త చెప్పోచ్చును. మరీ ఎక్కువగా పాల్గొంటే - మీరు ఆఫీస్ సమయాల్లో అందులో ఉంటున్నారా? అనేది కూడా తెలిసిపోయి, మీకు సమయపాలన చెయ్యటం రాదనీ వారికి తెలిసిపోతుంది. ఇలా ఒకరి మీద ఉన్న ప్లస్సులూ, మైనస్సులూ తెలుసుకోవచ్చును. కనుక తస్మాత్ జాగ్రత్త. 

మీరు నాకు అలాంటి సైట్స్ ఏమీ లేవు అని అబద్ధాలు చెప్పినా, ఆ మేనేజ్మెంట్ గూగుల్ లో సర్చ్ చేస్తే - ఒకవేళ మీ ఖాతాలు ఉంటే అబద్ధం చెప్పేవారి క్రిందే జమ. ఎంత బాగా ఇంటర్వ్యూ చేసినా, చివరికి మీరో మోసకారు గా ఆ సంస్థ గుర్తిస్తుంది. మీ పేరు మీద సర్చ్ చెయ్యటం కేవలం ఐదు నిమిషాల పని. ఈ మధ్య అన్నీ ఆన్లైన్ కి వస్తున్నాయి. 

వరి మీదో ఏదో చెప్పారని, వాటిని అందరికీ ఫార్వర్డింగ్ చేసే అలవాటు మీకుంటే ఇక మానుకోవాలి. అందులో నిజానిజాలు ఏమిటో మీకు సరిగ్గా తెలీవు. మనకి తెలిసేదంతా అన్నీ నిజాలు కావచ్చును.. అబద్ధాలూ ఉండవచ్చును. ఇక్కడ ఎలాగూ మీ స్నేహితులే ఉంటారు. మీరు అలా ప్రచారం చేసినా, ఎవరలా చెప్పారు అని అసలువారు అడిగితే, అందరి చేతి వ్రేళ్ళూ మీవైపే చూపిస్తాయి. ఆ అసలు స్నేహితులతో ఇక స్నేహం అనేది - పెద్ద దెబ్బ. ఇక ఆ స్నేహం మునపటిలా ఉండేది కష్టం. 

రువురి కలహాల మధ్యకి పోవటం అంత మంచిది కాదు. ఎక్కడో ఏదో నోరుజారారు అంటే ఇక మీరు కోలుకోవటం కష్టం. ఆ ఇద్దరికీ మీ మీద సదభిప్రాయం ఉంది అంటే - ఓకే.. అప్పుడు జాగ్రత్తగా డీల్ చెయ్యండి. లేకుంటే మీ వల్ల కాదని చెప్పండి. ఇందులో సాధారణముగా ఇద్దరివీ తప్పులు ఉంటాయి. లేదా ఒకరివే తప్పులు ఉండొచ్చును. కాని వారు ఒప్పుకోరు. మధ్యే మార్గముగా రాజీ చేసే సత్తా మీలో ఉంటేనే ఇలాంటివి చెయ్యండి. లేకుంటే హాయిగా మీ పనిలో మీరు ఉండండి. లేకుంటే మీకు చుక్కలు కనిపిస్తాయి.. 

మీ మిత్రులు మీతో ఎలా ఉన్నారు..? ఇప్పుడు మీతో ఎలా ఉంటున్నారు..? అప్పటికీ ఇప్పటికీ గల తేడా ఏమిటీ.. ఇలా అప్పుడప్పుడు అంచనాకి రండి. చిన్న చిన్న లోపాలు కనిపించినా మామూలుగానే ఉండండి. ఆ లోపాలని విశ్లేషించండి. అప్పుడు మీకు ముందు ముందు ఏదైనా ఉపద్రవం వస్తుందో లేదో మీకు కాస్త ముందుగానే తెలిసిపోతుంది. ఉదాహరణకి : ఒకప్పుడు మీతో బాగున్నవారు, ఇప్పుడు సరిగా లేరు అంటే - అందుకు గల కారణాలు ఏమిటో విశ్లేషించుకోండి. అలా ఎప్పటి నుండి జరిగిందో, అలా ఎందుకు, ఏమిటి కారణాలు.. చాలా నిజాయితీగా ప్రశ్నించుకోండి. అలా చేశాక మీది ఏదైనా తప్పు ఉంటే - ఆ అవతలి బాధితులకి ఆ విషయం చెప్పండి. లేదా కారణం అడగండి. ...ఇక అలాంటి పొరబాట్లు చెయ్యకండి. ఉదాహరణకి : నా మిత్రుడు ఒకరికి గుడ్ మార్నింగ్ విషెష్ చెప్పటం ఇష్టం ఉండదు. అలాని మా మధ్య గ్యాప్ వస్తే - ఒకసారి తనతో మాట్లాడాను. కారణం చెప్పాడు. మన్నించమని చెప్పి, ఇక అతగాడికి అప్పటి నుండి విషెష్ చెప్పటం మానుకున్నాను. అతనికి ఇష్టం లేనప్పుడు మానుకోవటమే మంచిది. అప్పటి నుండీ మా మధ్య స్నేహం మునపటిలా ఉండిపోయింది.  

మీకు నిజాయితీగా చేసే స్నేహితులు దొరికితే వారిని వదులుకోకండీ.. వారిలో లోపాలు కనిపిస్తే పట్టీపట్టనట్లు, చూసీ చూడనట్లు ఉండి పొండి. వారు ఏమీ అనుకోనివారైతేనే - అవి ఏమిటో సున్నితముగా చెప్పి చూడండి. అప్పటికీ వారు తమదే సరియైనది అని అంటే - "అవునా!! కావచ్చును.. మీదే సరియైనది. ఎందుకో అలాని అనిపించింది, అడగాలనిపించింది అడిగాను.." అని ప్రక్కకి తప్పుకోండి. కాని - ఇక్కడ అవతలివారు చెప్పింది - ఒకసారిఆత్మ పరిశీలన చేసుకోండి. అలా వారు చెప్పింది నిజమేనా మీకు మీరే ప్రశ్నించుకోండి. 

కవేళ వారే మీద అలా విమర్శ చేస్తుంటే - సావధానముగా వినండి. ఊ కొట్టండి. వారు చెప్పేదేదో చెప్పనివ్వండి. మధ్య మధ్య మంచి ప్రశ్నలు వేసి, మీమీద ఏమి విమర్శలో - వాటిని రాబట్టుకోండి. ఎదుటివారిని ఆసాంతం చెప్పనివ్వండి. సమయం ఉంటే కాసేపు సమయం అడిగి రిఫ్రెష్ అవండి. అదయ్యాకే - రిఫ్రెష్ అయిన మీరు తీరుబాటుగా అది ఎంతవరకు నిజమో మనసాక్షిగా ప్రశ్నించుకోండి. వారు చెప్పిన కోణములో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వారు చెప్పినది నిజమే అయితే - సిగ్గుపడకుండా, లేనిపోని భేషజాలకి పోకుండా వారికి కృతజ్ఞతలు చెప్పి, మీలోని లోపాలని మార్చుకుంటాను అని చెప్పండి. అది మీద చాలా రెట్టింపు గౌరవాన్ని కలుగచేస్తుంది. ఒకవేళ వారు చెప్పినవి అప్పటికీ అబద్ధాలుగా అనిపిస్తే - వారిని ఏమీ అనకుండా నవ్వేసి ఊరుకోండి.

దాహరణకి నా మిత్రులు ఒకరి ప్రవర్తన కాస్త తేడాగా ఉంటుంది. అందరూ చాటుగా కాస్త వేరుగా అనుకున్నారు. కానీ వారి ప్రవర్తన చిన్నప్పటి నుండీ అంతే!. కాస్త కలివిడితనం ఎక్కువ. కాని ఇక్కడ అలాని అనుకోవటం లేదు. ఒకసారి.. ఒక విషయములో దెబ్బ తిని, అలా ఓదార్పుకోసం చాట్ కి వస్తే  ఆ విషయం స్మూత్ గా చెప్పాను... తనకి అర్థం అయింది. నామీద ఇలా ఇంత చెడ్డగా అనుకుంటున్నారా?.. మరీ ఇంత చండాలముగానా?.. అని అన్నారు. తరవాత థాంక్స్ చెప్పారు. మార్చుకుంటాను అని చెప్పి ప్రవర్తన మార్చుకున్నారు. అప్పటిదాకా అలా ఉన్న తను ఇప్పుడు హుందాగా ఉంటున్నారు. ఇలా ప్రతివారికీ మైనస్సులూ ఉంటాయి.. (అలా నా సూచన వల్ల మారినందుకు - నాకు మరింత గౌరవం ఇస్తున్నారు. తనపట్ల నాకూ గౌరవం పెరిగింది.) ఈవెన్ నాలో లోపాలు ఉన్నాయి. లేవని కాదు. కొందరు చెప్పారు.. ఇవీ ఇవీ అనీ. బాగున్నవన్నీ మార్చుకున్నాను. ఇంకోన్నింటిని మార్పుల్లో ఉన్నాను. కనుక మార్చేవి చెబితే మారండి. అది మీకే మంచిది. నాకూ ఇంతగా తెలిసిందని మీరు అనుకోవచ్చును గానీ, నాకూ ఇంకా చాలా విషయాలు తెలీవు. నాలోని లోపాలు చాలా ఉన్నాయి. నామీద విమర్శలు తెలుస్తున్న కొద్దీ నేనూ మారుతున్నాను. అలా మంచి విమర్శల నేను మారాలీ అని వారు అనుకుంటుంటే - నేనూ ఆలోచిస్తున్నాను. మారితే ఎలా ఉంటుంది, అలా చెయ్యటం మూలాన నాకెంత కలిసివస్తుంది అనీ..

స్నేహం అంటేనే కొంత ఇస్తూ, కొంత తీసుకోవటం.. అంతే కాని కొందరుంటారే! వాళ్లకి తీసుకోవటమే గాని, ఇవ్వటం రాని వారు. ఇలాంటివారు చాలామంది కనిపిస్తారు. ఇలాంటివారు మీ స్నేహితులు అయ్యారే అనుకోండి. మీనుండి వారు పొందటమే గానీ, వారి నుండి మీకు ఏమీ రాదు.. ఇది బిజినెస్ కాదు. అయినా స్నేహం అనేది ఇస్తూ, తీసుకునేదిలా ఉంటేనే చాలా బాగుంటుంది. అలాంటి స్నేహితులు తక్కువ దొరుకుతారు.. అలాంటివారితో స్నేహముగా ఉంటే ఈ ఆన్ లైన్ స్నేహాలు బోర్ కొట్టవు. లేకుంటే మీకు సమయం వృధా, డబ్బూ వృధా..


(సశేషం) 
Related Posts with Thumbnails