Tuesday, August 9, 2011

మొబైల్ బ్యాటరీ - ఎక్కువ ఖరీదు.

చాలారోజులుగా ఒక ఫోన్ వాడటం లేదు. దాన్ని వినియోగములోనికి  తేవాలని అనుకున్నాను. ఆ ఫోన్ కి ఉన్న బ్యాటరీ కాస్త వీకయ్యింది. ఇక ఆ బ్యాటరీ మార్పించాలి. తెలిసిన మొబైల్ షాప్ కి వెళ్లాను. అక్కడ ఆ సైజులో లేదు. ఆ అబ్బాయి ఒక అడ్రెస్ చెప్పాడు. అక్కడ దొరకవచ్చును అనీ..

అక్కడికి వెళ్లి అడిగాను. అతను చూసి ఇచ్చాడు.. మామూలుది అయితే వందా - వందా ఇరవై, ఆరు నెలల వారంటీది రెండు ఎనభై అన్నాడు. ఆ వారంటీ బ్యాటరీ తీసుకున్నాను. వారంటీ వ్రాయించుకొని మళ్ళీ మొదటి షాప్ కి వచ్చాను. ఈ-చార్జ్ వల్ల బ్యాలన్స్ వేయిద్దామని. ఆ షాపతను అడిగాడు - "ఏం సార్ బ్యాటరీ వేయించారా?" అనీ.

"హా.. వేయించాను."  అని చెప్పాను.

"ఎంత?" అని అడిగాడు. నేను చెప్పాను - "ఆరునెలల వారంటీ రెండు వందలా ఎనభై" అనీ. అదిరిపోయి చూశాడు నన్ను. ఇలా గతుక్కుమని చూశాడేమిటీ అని కారణం అడిగాను.

"బాగా ఎక్కువ తీసుకున్నాడు. అది చైనా తయారీ. పోనీ మాంచి పీస్ అని కూడా కాదు. మామూలుది. నేను అమ్మేది  మాత్రం వంద పది, వంద ఇరవై అంతే.. ఈసారికి వాడికి ఏ జన్మలో, ఎక్కడో బాకీఉన్నారు అనుకొని మరచిపోండి. బ్యాటరీ కూడా దొరకటం లేదు మీ మోడల్ వి.." అన్నాడు.

నేను షాక్ అయ్యాను. అంటే ఇంకా ఒకటిన్నర రెట్లు డబ్బులు ఇచ్చి బ్యాటరీ కొన్నాను. కాస్త బయట తెలుసుకొని ఉంటే బాగుండేది. 

1 comment:

Sail: said...

People are like this!!! it is important that we enquire about some goods values before purchasing. I too happened to learn about getting quality products to the money we lend. Just take it as a funny one.. :) Things like this will remain forever in our super brains.. :)

Related Posts with Thumbnails