Friday, July 1, 2011

New features in G mail

మారుతున్న కాలానికి పోటీగా అన్నట్లు, జిమెయిల్ లో కూడా క్రొత్తవి సౌకర్యాలు వస్తున్నాయి.. ఈ మధ్య నేను గమనించినవి మీకు చూపిస్తాను.. ఈపాటికి మీలో చాలా మందికి ఇవి తెలిసి ఉండవచ్చును.. తెలీనివారికోసం ఇవి చూపిస్తున్నాను.. ఈ సౌకర్యాలు వల్ల జీ మెయిల్ చాలా ఈజీగా, బాగా వాడటానికి అనుకూలముగా ఉంది. ఇప్పుడు అందులోని ఫీచర్స్ ని ఒకసారి చూద్దాం.


1. వద్ద నున్న హారిజాంటల్ గా ఫ్లిప్ అయిన ఎంటర్ మార్క్ ని చూడండి. అది క్రొత్తగా పెట్టారు. దాన్ని నొక్కితే, ఇన్ బాక్స్ వద్దకి నేరుగా వచ్చేస్తాము. మీ ఇన్ బాక్స్ లో - లోలోతుల్లోకి వెళ్లి ఉన్నా, దీన్ని నొక్కగానే, హోం పేజీలోకి వచ్చేస్తారు.

2. వద్ద నున్న ఎడమ, కుడి బాణం గుర్తులని నొక్కితే, తరవాత పేజీలోకి వెళ్ళిపోతారు.. అలా మీ మెయిల్స్ ఎన్ని పేజీలలో ఉంటె అన్ని పేజీలకి వెళతారు. డిఫాల్ట్ గా పేజీకి 25 మెయిల్స్ ఉంటాయి. కుడి బాణాన్ని, మూడు సార్లు నొక్కితే 51 నుండి 75 మెయిల్స్ ఉండే పేజీకీ నేరుగా వెళ్లిపోతాము.

అలాగే మెయిల్ ఓపెన్ చేశాక - ఇంతకు ముందు వేరే మెయిల్ చూడాలంటే - బ్యాక్ రావాల్సి ఉండేది. ఒకవేళ నేను ఇదే బ్లాగ్ లో Gmail లో వరుసగా మెయిల్స్ చూడాలంటే దానిలో చెప్పినట్లు Auto advance అనే ఆప్షన్ ని ల్యాబ్ లో పెట్టుకుంటే, డెలీట్ చేశాక వేరే మెయిల్ చూసుకోవచ్చును అని చెప్పానుగా.. ఇప్పుడు మెయిల్ ఓపెన్ చేశాక - (ఆ మెయిల్ ని డెలీట్, బ్యాక్ చేయ్యకనే) ఈ బాణం గుర్తులని నొక్కితే ముందు, వెనక మెయిల్స్ ని ఎంచక్కా చూసుకోవచ్చును. బాగుంది కదూ..

3. ఈ అంతర్జాతీయ ప్రామాణిక సెట్టింగ్ గుర్తు అయిన దీన్ని నొక్కితే మెయిల్స్ సెట్టింగ్స్, ల్యాబ్, హెల్ప్.. ఇలా అన్నీ చేసుకోవచ్చును.

4. ఇక్కడ ఆ మెయిల్ పంపినవారు మీ లిస్టు లో ఉన్నట్లయితే, చాట్ చెయ్యొచ్చు, వారికి మెయిల్ చెయ్యొచ్చు, వారి డిటైల్స్ అప్డేట్ చేయ్యోచ్చును. వారి వివరాలు, ఫోటో.. అక్కడ పెట్టేసుకుంటే అడ్రెస్ బుక్ లా భద్రముగా ఉంటుంది. 

బాగున్నాయి కదూ!..  

No comments:

Related Posts with Thumbnails