Sunday, February 13, 2011

Social NW Sites - 15 - వారి ప్రొఫైల్ ఎలా ఉంది. తన గురించి ఎంతగా చెప్పారు.?

మనకి వచ్చిన ఆడ్ రిక్వెస్ట్ తాలుకు ఒనర్ యొక్క  వివరాలు తెలిపేదే - ప్రొఫైల్. ఒకరకముగా స్నేహానికి పెట్టుకున్న దరఖాస్తు ఫారం లాంటిది అని అనుకోవాలి. ఉద్యోగానికి దరఖాస్తు ఫారం ఎలానో, ఇక్కడ స్నేహానికి అప్లికేషన్ ఫారం అన్నమాట. ఒక్క మీ ఇంటి, ఆఫీస్ అడ్రెస్, ఫోన్ నంబర్స్ తప్పించి (అవి + అలాంటి సున్నిత పర్సనల్ వివరాలు తప్ప) అన్నీ వ్రాసుకోవచ్చు. సాధారణముగా అన్ని ప్రోఫైల్స్ లోని వివరాలు పూర్తిగా ఉండవు. వాటిని ఎలా పూరించాలో చాలా మందికి తెలియవు. అందుకే ఆడ్ రిక్వెస్ట్ పంపే ముందే కనీసం కొన్ని ప్రోఫైల్స్ చూడండి.. అన్నాను. అప్పుడు ఎలా నింపాలో తెలుస్తుంది అని చెప్పాను. ఇలా చూడక / చెయ్యక పంపితే మన రిక్వెస్ట్స్ రిజెక్ట్ అవుతాయి. నావీ చాలా రిజెక్ట్ అయ్యాయి. చాలా చాలా బాగున్న ప్రోఫైల్స్ వారివి. ఇంకోసారి ఆడ్ రిక్వెస్ట్ పంపాలంటే అభిజ్యాతం అడ్డు వచ్చేది. అలా ఒక్కొక్క దెబ్బ నుండీ ఒక్కో పాఠం నేర్చుకున్నాను.

ఇప్పుడు వారి ప్రొఫైల్ సంగతి చూద్దాం. అలాగే మనం ఎలా ఉండాలో కూడా..

మనం ఉద్యోగానికి ఎలా తగు వివరాలతో అప్లై చేస్తామో, ఇక్కడా మన ప్రొఫైల్ అంత బాగా ఉండాలి. చూడగానే ఏదో రొటీన్ ప్రొఫైల్ చూసినట్లుగా కాక, సంథింగ్ స్పెషల్ గా ఉండాలి. అలా ఉంటేనే మీకు కాస్త (చిన్న) సెలెబ్రిటీ లా గుర్తింపు వస్తుంది. మనం ఎదుటివారిలో వేటిని ఇష్టపడతాం, వేటిని అయిష్టం చేస్తాం.. మన హాబీలు, మనకు నచ్చే విషయాలు ఇలా అన్నీ ఆ స్నేహ అప్లికేషన్ అనబడే ప్రొఫైల్ లో పూరించాలి. అవేమిటో ఇక్కడ చూద్దాం.

ఆర్కుట్ లో ఆయితే New Orkut లో అంత మార్పులూ, ఎక్కువ వివరాలూ చేర్చరాదు.. అదే పాత ఆర్కుట్ లో బాగా వివరాలు చేర్చొచ్చు. (ఇక్కడ ఆర్కుట్ దే అని ఎందుకు చెబుతున్నాను అంటే - దాని గురించి మాత్రమే తెలుసు..ఇలా వ్రాసింది దానికోసమైనా మిగిలిన సోషల్ సైట్లకీ బాగా ఉపయోగపడుతుంది.) అందులో బయట తెలిసినా మీరు ఇబ్బంది పడనివే ఉంటాయి. అక్కడే అన్నీ పూరించటం మంచిది. అప్పుడే మీ ప్రొఫైల్ పూర్తిగా ఉంటుంది. ఇలా పూర్తిగా ఎందుకు నింపాలీ అంటే - ప్రతివారికీ మీ గురించి కాస్త ఇంట్రో ఇక్కడే ఇచ్చినట్లు ఉంటుంది - మళ్ళీ మీరు చెప్పాల్సిన అవసరం లేకుండా. మీ అభిరుచులు, మీకు ఇలాంటివి ఇష్టమో, ఇలాంటివి ఇష్టపడరో అన్నీ ఇక్కడే వ్రాసుకోవచ్చును. అది చూసి ఎవరైనా నచ్చితే మీకు ఆడ్ రిక్వెస్ట్ వస్తుంది. అవన్నీ నచ్చిన వారే మీకు ఆడ్ అవుతారు. రేపు ఏదైనా ఈ విషయాల్లో తేడా వస్తే - అప్పుడే నా ప్రొఫైల్ లో చెప్పాను ఇలా అని. అది చూశాకే ఆడ్ రిక్వెస్ట్ పెట్టాలి అని అవతలివారిని మందలించవచ్చు. అలా ఒక గొప్ప అవకాశం మన చేతిలో ఉంటుంది. అందుకే అవన్నీ ముందే వ్రాసుకోవాలి. అలా వ్రాసుకోలేకపోతే మనల్ని అవతలివారు దబాయించే అవకాశం ఉంటుంది.. మీ ప్రొఫైల్ లో అలా ఉంటే చూసి ఆడ్ రిక్వెస్ట్ పెట్టేవాడినే కానుగా అని  అనొచ్చు. ఇలా ఒక అవకాశం మనకి ఉంటుంది. ఉద్యోగములో జాయిన్ అయ్యేటప్పుడే అప్లికేషన్ లో ఈ ఈ కండీషన్స్ ఉన్నాయి.. చూసుకోక జాయిన్ అయ్యి.. ఇప్పుడు ఇలా అంటే ఎలా? అని ఉద్యోగాలలో ఎలా అంటారో ఇక్కడా ఇలాగే ఉపయోగిస్తుంది. అందుకే పూర్తిగా ఫిల్ చెయ్యండి. ఇలా మన ప్రోఫైల్స్ కి మాత్రమే కాకుండా కమ్యూనిటీలకు కూడా వ్రాస్తారు. అవేమిటో క్రింద శాంపిల్స్ చూడండి..
పైన దాంట్లో అమ్మాయిలతో డేటింగ్ చెయ్యాలని ఉంది అని ఒక అబ్బాయి వ్రాశాడు. అది చూసుకోవాలి. అలాంటి ప్రొఫైల్స్  కి అమ్మాయిలు ఆడ్ అయితే - అతడు అమ్మాయితో కాస్త చనువుగా ఉండొచ్చు. ఎక్కడైనా తేడా వస్తే - నేను ముందే నా ప్రొఫైల్ లో చెప్పాను Dating with women అనీ - అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి నోరేల్లబెట్టాల్సి ఉంటుంది.

ఇది కూడా అబ్బాయిదే - కానీ నేను చెప్పానుగా ఒక స్వలింగ సంపర్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రొఫైల్ లోని భాగం. ఇది ముందుగా పెట్టలేదు.. మధ్యలో ఇలా మార్చాడు. మధ్యలో చూసుకోకపోయేసరికి అవమానకర మాటలు (పొందుకోసం రమ్మని) చవి చూశాను. ఆడ్ అయ్యేటప్పుడే ఇలా పెట్టి ఉంటే అతనికి ఆడ్ రిక్వెస్ట్ పెట్టేవాడిని కాదు. ఇలాంటి భయంకర ఆహ్వానం పొంది ఉండేవాడినే కాదు. మధ్య మధ్య కూడా ప్రొఫైల్ మార్చగానే ఏమి మార్చారో కూడా ఒక లుక్ వెయ్యాలి. ఇలాంటివే కాదు ఇంకా ఇంతకన్నా భయంకరమైన ప్రోఫైల్స్ కూడా ఉన్నాయి.. అందుకే ప్రొఫైల్ బాగా స్టడీ చెయ్యండి. ఇలాంటివి చాలామందికి అనుభవాలే. అందుకే మరీ మరీ చెప్పటం. - ప్రొఫైల్ ని బాగా స్టడీ చెయ్యండీ అని.

వారి ప్రొఫైల్ ని జాగ్రత్తగా పరిశీలించండి. ఆ తరవాతే ఒక నిర్ణయానికి రండి. నాకు తెలిసీ - ఒకతను మనకి తగినవాడా లేదా అనేది ఇక్కడే 70 - 80% ఇక్కడే పరిశీలించవచ్చును. అతని ప్రొఫైల్ లో అతను అంటే ఏమిటో అంతా సరిగ్గా చెప్పేస్తే - ఎంపిక చాలా ఈజీగా ఉంటుంది. నిజానికి అలా ఎవరూ వ్రాయరు. చాలా తక్కువ ప్రోఫైల్స్ లలో అలా కనిపిస్తుంది. ఇక్కడే మనం ఇక ముందు ఎంత సంతోషముగా ఉండబోతున్నామో - పునాది పడుతుంది.

1. అతని ఫోటో, ఫోటో క్రింద అతని ప్రొఫైల్ పేరు చూడండి. బాగుందా..?

2. డీపీ ఫోటోకి కమ్యూనిటీ లలో ఉన్న లింకులూ  చూడండి. (ఇదేమిటో ఇప్పుడు అర్థం కాదు - "కమ్యూనిటీస్" అన్నదాంట్లో చెబుతాను.)

3. అతను ఉంటున్నది ఏమి ఊరో చూడండి. ఊరిపేరు సరిగ్గా లేనివారే మిమ్మల్ని మోసం చేసే గుణాలు ఎక్కువ. హైదరాబాద్ చుట్టుపక్కల్లో ఉంటూ కూడా హైదరాబాద్ అని పెట్టుకునేవారిని చాలామందినే చూశాను. వారి ఊరు + హైదరాబాద్ అని రెండూ వ్రాయొచ్చు కదా.. (ఉదాహరణ : చేవెళ్ల / హైదరాబాద్.) ఇలా వ్రాసుకున్న వారిని చూశాను. వారికి నా అభినందనలు.

4. క్రింది ఫోటోలో మాదిరిగా ప్రతివారి పేజీ లోని భాగం కనిపిస్తుంది.
స్క్రాప్స్ ఎన్నున్నాయో, ఫొటోస్ ఎన్ని ఉన్నాయో, అతనికి నచ్చిన వీడియోలు ఎన్ని ఉన్నాయో, అతని ఫాన్స్ ఎవరున్నారో కూడా చూడండి.

5. ఫాన్స్ అంటే వారిని నచ్చినవారు. ఆ ఫాన్స్ మీద నొక్కితే తెలుస్తుంది. వారు అతనికి ఎంత శాతం మార్కులు వేశారో అక్కడే తెలుస్తుంది. అది ఇలా క్రింది దానిలా ఉంటుంది.
ఇలా ఉన్న దాంట్లో వారికి ఎంత మంది స్నేహితులు ఉన్నారో - వారు ఎంత శాతం మార్కులు ఇచ్చారో తెలిసిపోతుంది ఇక్కడే. దాన్ని బట్టి వారి గురించి ఒక నిర్ణయానికి రావచ్చును.

6. ఇది ఇలా మార్క్స్ ఇవ్వటం అవతలి వారి మెచ్యూరిటీ, ఇష్టా ఇష్టాలమీద ఉంటుంది. అంతే కానీ దీని మీదే ఆధారపడకండి. ఎలా మార్క్స్ ఇవ్వాలో తెలీని వారు కూడా 100 % మార్క్స్ ఇవ్వొచ్చును. అందుకే అదే కొలమానంగా తీసుకోవద్దు.

7. అసలు సిసలు అయినదే ప్రొఫైల్. అందులో ఒక్కోవివరం - వారు పోస్ట్ చేసినది చూసుకుంటూ రండి. అప్పుడే తెలుస్తుంది. మీ తప్ప మీ గురించి, మీ నైజం ఎలాంటిదో ఎదుటివారికి అన్నీ తెలుస్తాయి. కాస్త విశ్లేషణ సామర్థ్యం ఉంటే అన్నీ ఇక్కడే అంచనా వెయ్యొచ్చు. 50% మార్కులు ఆ ప్రొఫైల్ కి వస్తే మీకు మంచి స్నేహితుడే దొరుకుతాడు. అలా చూడకుండా ఆడ్ చేసుకుంటే - మీ ఫ్రెండ్స్ లిస్టు సంఖ్య పెరుగుతుంది. అంతే!.

8. అబౌట్ మీ - ఇందులో అంతా మీ గురించి చెప్పుకునేదే. కానీ చాలామంది ప్రోఫైల్స్ లో అవేమీ ఉండవు. సినిమా బొమ్మలూ, వీడియోలూ, హీరోల ఫోటో ఉంటాయి. వారి గురించి చెప్పుకోరు. అలాంటి ప్రోఫైల్స్ ఉండటం చాలా తక్కువ. మీకు ఎలాంటివారు కావాలో చూసుకొని అలాంటివారిని వెదికి స్నేహం చేసుకుంటే - మీకే బాగుంటుంది. సమయమూ మిగులుతుంది.

9. ఆ ప్రోఫైల్స్ లలో చెప్పినదంతా నిజమనే నమ్మకండి. వాస్తవం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. అందమైన ప్రొఫైల్ అని వెంటనే అడ్వాన్స్ అవకండి. కొంత అనుభవం వస్తే - మీరే కొద్దిగానైనా చెప్పగలరు ఎవరు ఎలాంటివారో!. ఇక్కడ ఒక నిజం చెబుతాను. వాస్తవ జీవితములో ఒక టీవీ కొనాలి అనుకుంటే ఎన్నో చూస్తాం.. వాటి ఫీచర్స్, సౌండ్, బడ్జెట్, అదనపు సౌకర్యాలు.. దానివల్ల మనకి సమకూరే సౌకర్యం.. ఇన్ని ఆలోచిస్తామే.. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇంతలా ఆలోచించక తప్పటం లేదు. టీవీ కొన్నాక ఎలా దాని ఫీచర్స్.. హడావిడి మరిచి ఎలా ఎంజాయ్ చేస్తామో ఇక్కడా - స్నేహాల్లో కూడా అలాగే వారి ప్రొఫైల్స్ ని మరిచి స్నేహం కంటిన్యూ చేస్తుంటాం. ఆ ఎంతో ఏరి కోరినా టీవీ ఇబ్బంది పెడితే - ఎంత అసహనానికి గురి అవుతామో ఇక్కడా అంతే!.. ఇంకో టీవీ కోసం వెళ్లక తప్పదు. కాకపోతే రిపైర్ చేయించగలమా లేదా? అని చూస్తాం కదా.. మాక్జిమం ప్రయత్నించి ఇంకో టీవీకి వేల్లిపోతుంటాముగా. ఈ e-స్నేహాల్లో కూడా అలాగే చెయ్యకతప్పదు - ఇది ఇంకోదానిలో మాట్లాడుకుందాం.

10. వారి వారి ప్రొఫైల్ లో బాగా గమనిస్తే - అతను ఎలాంటివారో, వారితో మనం ఎలా ఉండగలుగుతామో మీకే తెలిసిపోతుంది. కొన్ని ప్రొఫైల్ స్నేహానికి అన్నట్లు ఉంటాయి. ఇంకొన్ని దాపరికముతో ఉంటాయి. మరికొన్ని కేవలం ఫన్నీ, ఎంజాయ్మెంట్ కోసమే ఉంటాయి. మీకు ఇందులో ఎలాంటి ప్రోఫైల్స్ వారు కావాలో, ఎలాంటి ప్రొఫైల్ ఉన్నవారితో మీరు ఆనందం అనుభవించగలరు అనేది ముందే ఒక నిర్ణయానికి రండి. ఇది మీ ప్రొఫైల్ వ్రాసుకునేటప్పుడే గ ట్టి గా నిర్ణయించుకోండి. ఆ తరవాతే స్నేహితులని ఎన్నుకోండి. అలాచేస్తే మీకు మానసిక క్లేశాలు తగ్గించుకున్నవారు అవుతారు.

11. స్నేహానికి అన్నట్లు ఉన్న ప్రోఫైల్స్ లలో వివరాలు అన్నీ ఉంటాయి. వారి ఫొటోస్, వివరాలు, ఫోన్ నంబర్, చదువుకున్న కాలేజి వివరాలు, వారి అభిరుచులు, వారికి ఏమేమి ఇష్టం, ఎక్కడ ఉంటున్నారో.. ఇలా అన్నీ ఉంటాయి. ఇలాంటివారితో రిస్కులు చాలా తక్కువ. ఈగ్రూప్ లో చాలామంది జెన్యూన్ పర్సన్స్ దొరుకుతారు. వీరు ఎక్కువగా ఆ సైట్లలోకి రారు. స్క్రాప్స్ కూడా తక్కువే వ్రాస్తారు. వచ్చినా ఎక్కువగా ఇన్విజిబుల్ లో ఉంటారు. ఒక సజ్జన సాంగత్యం కోసం వీరిని ఎంచుకోవచ్చును.

12. దాపరికం ఉండే ప్రోఫైల్స్ లలో అన్నీ దాపరికమే. అంటే వారివి యే వివరాలు ఉండవు. ఎదుటివారి మీద నిఘా పెట్టడానికో, లేక ఎదుటివారు ఏమి చేస్తున్నారో తొంగి చూడటానికి వాడుకునే ప్రోఫైల్స్ ఇవి. ఇలాంటివారు ఎక్కువగా స్క్రాప్స్ వ్రాయరు - వ్రాస్తే ఎక్కడ వీరిని డిటైల్స్ అడుగుతామో అని వ్రాయకపోవచ్చును. ఎక్కువగా ఆన్ లైన్లో ఉండరు. ఉన్నా ఇన్విజిబుల్ లో ఉంటారు. కొద్దిమంది ఉంటారు. వారు మాత్రం విండో షాపింగ్ చేసినట్లుగా మిత్రుల ప్రోఫైల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా మిత్రులని ఎన్నుకున్నా ఇలాంటి ఐరావతాలు ఆడ్ అవుతూనే ఉంటారు. వీరిలో మాట్లాడేవారూ ఉంటారు. కాని వారి వివరాలు ఎక్కడా తెలీవు. అన్నీ రహస్యం. కాని మనవి మాత్రం అన్నీ లాగేస్తుంటారు.

13. ఇక మూడో గ్రూపుకి చెందినవి - ఫన్నీ, ఎంజాయ్ పర్పస్ కోసం లాగిన్ అయ్యేవారు. ఇందులో మూడు రకాలు.
  1. ఎదుటి వారినుండి వినోదం కోరేవారు.
  2. ఎదుటివారికి వినోదం ఇస్తూ, తిరిగి వినోదం అందుకునేవారు.
  3. వినోదం ఇచ్చేవారు కాని తీసుకోవటం రానివారు.
14. వీరితో ఆనందం బాగుంటుంది. నిజానికి సోషల్ సైట్లో వీరిదే సందడి. వీరు లేకుంటే బోర్ కొట్టేస్తుంది. ఎంతగా అంటే ఆ సైట్లలోకి ఇక రానంతగా. వీరితో స్నేహాలు బాగుంటాయి. తొందరగా స్నేహితులమవుతాము. బాగా కలివిడిగా ఉండిపోతాం. వారికోసమే అంతర్జాలానికి వచ్చేంతగా ఉంటాయి. రోజులు నిమిషాల్లాగా గడిచిపోతుంటాయి. సోషల్ సైట్లలో ఎక్కువగా ఇష్టపడేది వారినే. వారికీ స్నేహితులేక్కువ. బాగా అట్రాక్షన్ గా ఉంది కదూ..

15. వీరిలో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వీరి ప్రొఫైల్ లో ఎక్కువగా వినోదమే లక్ష్యముగా ఉంటుంది. వీరికి - ఎక్కువగా వీరి నుండి ఆనందం కోరుకునేవారు మాత్రమే దొరుకుతారు. వీరు ఎప్పుడు నవ్విస్తారా! ఎప్పుడు నవ్వుదామా అనీ, కానీ వీరికి ఆనందం కలిగించే వారు ఉండరు. వారి అసలు వివరాలు చాలా తక్కువగా ఉంటాయి. వారితో సమానముగా టాలెంట్ ఉండి వారితో బాటు పాల్గొంటే మంచిది. బాగా తెలివితేటలూ, రిటార్టులూ, కటింగ్స్, మాటకి మాట, సబ్జెక్ట్ నాలేడ్జ్ బాగా ఉంటేనే ఇందులో ఎదురుక్కోగలం. లేకుంటే హుందాగా ఉండటం చాలా నయం. ఒకసారి చులకన అయ్యామా - చాలా కష్టం. ఇంకా అర్థం కావాలంటే కాలేజీల్లో కోతిమూక విద్యార్థుల గుంపు అంటూ ఉంటామే - వారితో స్నేహం ఎలాగో వీరితో కూడా అలాంటిదే. వీరి ప్రోఫైల్స్ లాగానే మనవీ మామూలుగానే, మన గురించి ఎటువంటి సమాచారం లేకుండా చూసుకోవటం చాలా మంచిది. అలా ఉంటేనే బాగా ఎంజాయ్ చెయ్యగలరు. మీవి అన్నీ బయట పెట్టాక అందులో పాల్గోనలేకపోతారు - అది నిజం. కొద్దిగా బెరకుగా ఉంటుంది. అందుకే మొదట్లోనే చెప్పాను. అన్నీ వివరాలు పెట్టినవారు ఎక్కువగా అల్లరి చెయ్యరు అనీ. ఏదైనా అల్లరి చేస్తే నన్ను గుర్తుపట్టి ఏదైనా అంటారేమో అనే ఫీలింగ్ అక్కడ ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే - అలా చెయ్యటం తప్పదు.

16. నేను వీరితో ఉండటం వల్ల మాటల్లో చాలా పదును, తెలివితేటలూ వచ్చాయి.. వారికి కృతజ్ఞతలు. కానీ ఆ పదును అంతా అవహేళన కి వాడటం మూలాన, రియల్ లైఫ్ లో ఇబ్బందులు పడాల్సివచ్చింది. వీడితో మాట్లాడటమా.. అయ్య బాబోయ్.. అనే స్టేజికి వచ్చేశారు. ఇంటా బయటా బాగానే రిలేషన్స్ దెబ్బ తిన్నాను. కారణం చాలా సింపుల్. ఎదుటివారు మాట్లాడితే మనం పడాలి. ఈలోకములో ఇదొక విచిత్రమైన పరిస్థితి. గెలికించేదేవారు. వారి భాషలోనే సమాధానం చెబితే తట్టుకోరు. వారి కన్నా వెటకారముగా మనం మాట్లాడితే వారు అసలు భరించలేరు. సోషల్ సైట్ లైఫ్ కన్నా రియల్ లైఫ్ ముఖ్యము కదా!.. ఇక లాభం లేదని ఇటువంటివారికి కాస్త దూరముగా ఉండవలసివచ్చింది. అందుకే స్నేహితులని ఎన్నుకునే ముందు కాస్త చూసి - ఆడ్ చేసుకోండి. ప్రొఫైల్ చూసి బాగా ఒక నిర్ణయానికి రండి అని చెబుతున్నాను.

17. కొంతకాలము తరవాత మన ప్రొఫైల్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఎందుకూ అలా చేసుకోవాలో చూడండి. ఒకతను నా ఒకప్పటి మిత్రుడే. ప్రొఫైల్ సరిగా లేదని, అంతా ఏదో ఏదో సెక్స్ గురించి ఉందని తీసేశాను. మళ్ళీ ఓ ఆరు నెలల తరవాత ఆడ్ రిక్వెస్ట్ పెట్టాడు. సేమ్ అదే ప్రొఫైల్. ఏమీ మారలేదు. మీరే చూడండి. ఇలాంటి ప్రొఫైల్ ఉన్నవారిని ఎలా ఆడ్ చేసుకోవాలో మీరే చెప్పండి.. ఆరు నెలల మీద అయినా అతని ప్రొఫైల్ కి ఏమైనదో కూడా చూసుకునే అంత సమయం లేదన్న మాట. లేదా అతనికి ఎవరూ చెప్పలేదన్నమాట. అలా వైరస్ వల్లనో, హాక్ అవటం మూలానో అలా జరుగుతుంది.


ఇలా ఉంటే ఎలా ఆడ్ చేసుకోగలం మీరే చెప్పండి. అందుకే అప్పుడప్పుడూ మన ప్రొఫైల్ అప్డేట్ చేస్తుండాలి. అలాగే ఒకసారి చూస్తూ ఉండాలి. ఇప్పటికీ ఆ ప్రొఫైల్ లో ఇంకా ఇలాగే ఉంది కూడా..

18. మొన్న నేను ఇలా చెప్పినందులకు ఒకరు వేరేవారితో అనిపించారు. నా ప్రొఫైల్ గురించి ఇలా వ్రాస్తావా? అని. వారి ఆడ్ రిక్వెస్ట్ ని నేను రిజెక్ట్ చేశాను. కారణం ఏమిటంటే - వారి ప్రొఫైల్ లో ఏమీ లేదు. ఆ విషయమే నా బ్లాగ్ లో చెప్పాను. దానికి ఒక గొడవ. తను కాక మధ్యలో ఉన్న - గొడవ పడ్డ - బాగా మంచి మిత్రులం స్క్రాప్స్ వ్రాసుకోనంతగా మారిపోయాం. ఇప్పుడు ఆ ఒకరు నా బ్లాగ్ చదివి, వారి ప్రొఫైల్ ని బాగా మార్చుకున్నారు. సంతోషం..!!  ఈ పనేదో అప్పుడే చేస్తే మా మధ్య గొడవలు వచ్చేవి కాదుగా.. అందరూ బాగుండేవారు కదా.. అంతా నా మంచికే అనుకుంటాను నేను. తనకి బాగా రుణపడిపోయాను నేను.

19. ప్రోఫైల్స్ కొందరికి సొంతముగా కూడా వ్రాస్కోరాదు. అందరూ తమకి ఆడ్ కావాలని వేరే వారి ప్రొఫైల్ ని తమ అబౌట్ మీ గా పెట్టేసుకున్నారు. ఇలా నాదీ, నా మిత్రులవి ఇద్దరివీ ఇలా (మక్కికి మక్కి) కాపీ చేసుకొని పెట్టుకున్నారు. ఇదే కాపీ చేసినవారు రేప్రోద్దున వారు పెట్టే - ప్రతి స్క్రాప్, ఫోటో, కామెంట్ అన్నీ కాపీ కావని గ్యారంటీ ఏమిటీ.. ?

2 comments:

Anonymous said...

chalaa baagaa cheppaaru. mee blog ni regular gaa fallow avuthoo, naa account lo maarpulu, naa paddathullo maarpuloo chesukuntunnaanu. meeku naa kruthagnathalu.

Raj said...

ధన్యవాదములు..

Related Posts with Thumbnails