Wednesday, February 2, 2011

Social NW Sites - 10 - టెస్టిమోనియల్స్

టెస్టిమోనియాల్స్ అంటే మనం ఎలాంటివారో మన మిత్రులు - మన గురించి - ఇతర మిత్రులకి చెప్పే మాటలు అన్నమాట. మన ప్రొఫైల్ క్రిందిభాగములో ఇది కనిపిస్తూ ఉంటుంది. మన మిత్రులు మనతో స్నేహం చేశాక ఒకరకమైన అభిప్రాయం ఏర్పడుతుంది కదా!.. వారు మన గురించి ఇతరులకు ఏమి చెప్పాలనుకుంటున్నారో, అది ఇక్కడ చెబుతారు. ఒక సన్మాన సభలో - సన్మానం చేసుకునేవాడి గురించి వక్తలు ఎలా చెబుతారో, అలా ఇక్కడ మీరు వారి గురించి చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పేసి పోస్ట్ చేస్తే, ఆ ప్రొఫైల్ స్నేహితునికి నచ్చితే - దాన్ని అంగీకరించి, ఓకే చేస్తే అది వారి వారి (ఆర్కుట్) ప్రొఫైల్ అడుగు భాగములో కనిపిస్తుంది.

దీనివలన వచ్చే లాభం ఏమిటంటే - ఆ ప్రొఫైల్ కి ఆడ్ అయ్యే నూతన మిత్రులు, ఆ ప్రొఫైల్ అతను లాంటివారో తెలుసుకోవటానికి - ఈ టెస్టిమోనియల్స్ మీదే ఎక్కువగా ఆధారపడతారు. నిజానికి ఆ టెస్టిమోనియల్స్ అనే ఆప్షన్ పెట్టిందే అందుకు. కానీ నిజముగా ఇలా వారి గురించి వ్రాసే టెస్టిమోనియల్స్ వ్రాసేవారు చాలా తక్కువ. నిజమైన టెస్టిమోనియల్స్ చాలా చాలా తక్కువ ప్రోఫైల్స్ లలో ఇలా కనిపిస్తాయి. చాలా ఎక్కువగా ఏవేవో బొమ్మలూ, ఫొటోస్, గ్రీటింగ్స్.. కొండొక చోట స్క్రాప్స్ కనిపిస్తూ ఉంటాయి. నిజానికి అవి టెస్టిమోనియల్స్ కావు. నేనూ ఎక్కువగా టెస్టిమోనియల్స్ పంపలేదు. పంపాలి. కొద్దిమందికి మాత్రమే పంపాను.

టెస్టిమోనియల్స్ అంటే మీకు మరీ ఈజీగా అర్థం కావటానికి ఈ క్రింది రెండు ఫొటోస్ చూడండి. మీకే అర్థం అవుతుంది. కనిపించకుంటే డబల్ క్లిక్ చేసి చూడండి. చాలావరకు ఎడిట్ చేశాను. సమయం లేక ఇంకా ఇలాంటి సాంపిల్ టెస్టిమోనియల్స్ వెదకలేదు. మన్నించాలి.


ఇంకొకటీ..



చూశారు కదూ.. ఇది మచ్చుకు చూపించాను. ఇలా అంటే ఇలాగే కాదు. ఒక వ్యక్తితో - పరిచయమై, స్నేహం చేసి, అతనితో ఉంటే ఎలా ఉంటుందో, అతను ఎలాంటివాడో తెలియచెయ్యటం అన్నమాట. పైనవి రెండు టెస్టిమోనియల్స్ చదివాక అతనితో స్నేహం చెయ్యాలని బాగా ఉబలాటముగా ఉంది కదూ. ఇంత మంచి ఫ్రెండ్ దొరికితే బాగుండును అని అనుకుంటున్నారు కదూ.. అదిగో - సరిగ్గా అలా అనిపించేలా చేసేదే - టెస్టిమోనియల్. అదీ దాని గొప్పదనం. నేనూ ఇవి చూసే అతనికి ఫ్రెండ్ అయ్యాను. అప్పుడు  వీరు చెప్పినవీ నిజమే అని తెలుసుకున్నాను.

No comments:

Related Posts with Thumbnails