Friday, April 16, 2010

యూ-ట్యూబ్ వీడియో - నాది మీరే కాపీ చేసారు

మొన్న నా యూ-ట్యూబ్ అక్కౌంట్ కి ఒక మెయిల్ వచ్చింది. ఏమిటా అని ఓపెన్ చేసి చూసాను. ఒకతను నేను పెట్టిన వీడియో అతనిది అని అతని బాధ. నాకు నవ్వొచ్చింది. అసలు ఏమిజరిగిందో చెబుతాను - ఆతర్వాత మీకే తెలుస్తుంది.

మా టీవీలో ఐడియా సూపర్ సింగర్స్ ప్రోగ్రాం లో నా ఆర్కుట్ మిత్రురాలు పాల్గొన్న కార్యక్రమం వచ్చింది. ఆ విషయం తను నాకు చెప్పింది. ఎలాగూ నా సిస్టం కి ఇన్ బిల్ట్ టీవీ ట్యూనర్ ఉంది కాబట్టి ఆ ప్రోగ్రాం ని రికార్డు చేసి ఆమెకీ సర్ప్రైస్ చేసినట్లుగా ఆవిడ రికార్డు పంపుదామని అనుకున్నాను. ఆవిడ ప్రోగ్రాం వచ్చింది.. చూస్తూ రికార్డ్ కూడా చేసాను. అలాగే ఆరోజే - న్యాయనిర్ణేతలుగా చంద్రబోసు గారూ, భాస్కర భట్ల రవికుమార్ గారూ ఉన్నారు. ఆ ప్రోగ్రాం లో మధుప్రియ (గోదావరిఖని) అనే అమ్మాయి పాడిన "ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని.." అనే పాట కూడా వచ్చింది. అదీ రికార్డ్ చేసాను. ఆ పాటని చాలా రోజులుగా నా సిస్టమ్ లోనే ఉండిపోయింది.

అప్పటికే నాకు యు-ట్యూబ్ లో నా అక్కౌంట్ ఉంది. అందులో ఒక్క వీడియో కూడా పెట్టలేదు. చాలా రొజూ ఖాళీగా ఉంచాను. టీవీ ప్రోగ్రాం లు పెట్టొద్దు అనే నిబంధన చూసి ఏవీ టీవీ ప్రోగ్రామ్లు అందులో పెట్టలేదు. అందులో ఒక వీడియో కోసం వెదుకుతుండగా ఈ " ఆడపిల్లనమ్మా.." అనే పాట కూడా కనిపించింది. కాని అది క్లారిటీగా లేదు. నా దగ్గర ఉందిగా నాదగ్గర ఉంచుకుంటే లాభం ఏముంటుంది అని ఆ క్లారిటీ వీడియోని వీలు చూసుకొని యు-ట్యూబ్ లోకి ఎక్కించాను. అలా పెట్టిన వీడియో కి రాను రాను హిట్స్ పెరగసాగాయి. దాన్ని ఇంకా మంచి ప్రజెంటేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనుకొని వీలున్నప్పుడల్లా చాలా బాగా దాని గురించిన మిగతా విషయాలు పెట్టసాగాను. ఆ 2: 39 నిముషాల వీడియోకి ఇప్పటికి ముప్పై వేలకి పైగా హిట్స్ ఉన్నాయి.  అదలా ఉంటే - ఇక అసలు సంగతికి వద్దాం!

మొన్న ఒక మెయిల్ వచ్చింది. యు-ట్యూబ్ వారు దాన్ని ఎండార్స్ చేసారు. మామూలుగా ఉండే మెచ్చుకోలు కామెంట్ కావచ్చని యధాలాపముగా ఓపెన్ చేశా. కాని షాక్!  ఆ మెయిల్లో అతను - ఆ వీడియో నాది అని గోల. నాకైతే నిజముగా నవ్వొచ్చింది. నిజానికి అది మా టీవీ వారి వీడియో. బాగుందని అందరూ చూడాలని ఆ అమ్మాయి టాలెంట్ పదిమందికి తెలియాలని పెట్టాను. ఇంకా ఆ పాట సాహిత్యం కూడా తెలుగులో వ్రాసి అక్కడే పోస్ట్ చేసాను. అలాగే టాగ్స్ అంటే ఏమిటో తెలీని నేను అవేమిటో తెలుసుకొని మరీ పెట్టాను. అలాంటి వీడియో ని మనోడు కాపీచేసి నాది అని అతని యు-ట్యూబ్ అకౌంట్ లోకి మార్చుకున్నాడు. మార్చుకోనీ.. ఏమీ బాధలేదు. "నాది అంటూ మీరే కాపీ చేసారు.." అంటూ నన్ను అనడమే వింతగా ఉంది. పోనీ అతని వీడియో చూసాను. సేం టూ సేం నాదే! నేను వ్రాసిన పదాలూ, కామాలూ, ఫుల్ స్టాపులూ.. అన్నీ సేం టూ సేం!  ఆఖరికి లిరిక్ కూడా.. అతని యు-ట్యూబ్ ఎకౌంటు లో అదొక్కటే వీడియో ఉంది. నేను వ్రాసిన పదాలూ, అప్లోడ్ చేసిన వీడియో ఇంకా నావద్దె ఉన్నాయి.. ఇలా కాపీ చేసి నాదే అనిపించుకోవటం ఒకరకముగా పోనీ అనుకున్నా, ఒరిజినల్ గా పెట్టిన వారిని ఇలా కాపీ చేసావు అనడం ఏమీ బాగో లేదు.  ఎంతైనా కలికాలం..

No comments:

Related Posts with Thumbnails