Thursday, April 1, 2010

బ్లాగు పేరు మారుస్తానని వోటింగ్ - ఫలితం

నా బ్లాగు పేరు మారుస్తానని వోటింగ్ పెట్టానుగా! ఇప్పుడు ఫలితం చెబుతున్నాను.
నా బ్లాగు పేరు ఇంగ్లీషులో ఉండి కదా.. దాన్ని తెలుగులో ఉంటే బాగుంటుందేమోనని అభిప్రాయ సేకరణ చేసాను.. బాగా రెస్పాన్స్ వచ్చింది మొత్తం డెబ్భై ఆరు మంది పాల్గొన్నారు! ఆ రిజల్టు ఇక్కడ చూపుతున్నాను..


బ్లాగు పేరు మార్చండి అంటారేమోనని ఎదురు చూసాను.. కాని 46% మంది మాత్రం మార్చమన్నారు.. మిగతావారు ఇదే బాగుందనీ, వేరేది మార్చమనీ అన్నారు.. ఫలితముగా ఏదీ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను..  అంతవరకూ ఇదే - అంటే My VALUABLE LESSONS అనే ఉంచుతున్నాను.. మీకు అనవసరముగా శ్రమ కలిగించానని అనుకుంటాను.. మీరంతా వోటింగులో పాల్గొన్నందులకి మీకు నా కృతజ్ఞతలు.

2 comments:

భాస్కర రామిరెడ్డి said...

మీకు మార్చాలని వుంటే ఇంతమందిని నిజంగా అడిగి వుండేవారా? ;)

Raj said...

నిజముగానే మార్చాలని అనుకున్నాను.. తెలుగులో వ్రాస్తూ, ఇంగ్లీష్లో టైటిల్ ఏమిటాని! ఏ మూలనో అలాగే ఉంటే బాగుంటుంది.. అని ఉందనుకోండి! ఇన్ని రోజులూ ఆ (బ్రాండ్) నేమ్ తో నా ప్రొడక్ట్స్ చూపించేవాడిని. క్రొత్త బ్రాండ్ నేమ్ పెట్టి మళ్ళీ మొదటి నుండి ఎందుకు కష్టపడాలని? - అలాగే ఉంచేయ్యటానికి ఒక కారణం. ఏది ఏమైననూ.. మీ స్పందనకి కృతజ్ఞతలు..

Related Posts with Thumbnails