Tuesday, December 1, 2009

బస్ లో వాంతి

మొన్న ఓ పనిమీద బస్ లో బయలుదేరాను. మార్గ మధ్యమములో ఒక జంట నా ప్రక్క సీట్లోకి వచ్చి కూర్చున్నారు. వారికి ఐదు-ఆరు సంవత్సరాల పాప. నేను ఐపాడ్ లో పాటలు వింటూ కళ్లు మూసుకున్నాను.. వారేమో మెలుకువగానే ఉన్నారు.

ఇంతలో అలజడి. ఏమిటా అని చూస్తే ఆ పాప వాంతి వస్తున్నట్లుంది.. బలవంతం మీద ఆపుతున్నారు. తరవాత జరిగేది ఏమిటో అర్థమయ్యింది.. చప్పున గుర్తుకు వచ్చింది. నా బాగ్ జిప్పు తెరచి అందులో ఓ మూలనుంచిన ఒక ప్లాస్టిక్ కవర్ తీశాను.. వారికి ఇచ్చి పాపకి మూతి వద్ద పట్టమన్నాను. ఆ పాప వాంతి చేసుకుంటే వారు పట్టారు. నా సమయస్ఫూర్తి వల్ల బస్ లో సీట్ పాడుకాకుండా కాపాడాను, అలాగే వారికి ఉపయోగపడ్డాను - అనే సంతోషముతో కాసేపు కునుకు తీశాను..

తరవాత కాసేపు తరవాత మెలకువ వచ్చి చూస్తే వారు లేరు.. మధ్యలో దిగారేమోనని అనుకున్నాను. కాని దిగలేదు.. ఇంకో సీట్లోకి వెళ్లి కూర్చున్నారు. ఇదేమిటబ్బా అని అనుమానముతో నా సీటు పక్కన చూసాను.. అప్పుడు అర్థం అయ్యింది.. ఆ వాంతి కవరుని అక్కడే వదిలేయటముతో అందులోని ద్రవమంతా బయటకి వచ్చింది. వాళ్ళని తిట్టాలంత కోపం వచ్చింది..

ఏమిటీ మనుష్యులు.. ఇంత నిరక్ష్యం. -అని. ఆ పాపకి అంత పొద్దున్నే టిఫిన్ కుక్కడమెందుకు? వాంతి వస్తుందన్న జ్ఞానంతో ఒక కవరును వెంట తెచ్చుకోవాలన్న కనీస జ్ఞానం లేదు. వెంట తెచ్చుకోలేదు.. పోనీ ఒకరిస్తే దాన్ని తీసుకునేటప్పుడు థాంక్స్ చెప్పాలన్న తెలివి లేదు. సరే అదంతా పోనీ!.. వాంతి తరవాత ఆ కవరుని బస్ కిటికీ లోంచి బయట పడేస్తే అయిపోయేదిగా ఒకవేళ పడేయడానికి సమయం లేకుంటే ఆ కవరుని ముడి వేసి అలాగే పెడితే సరిపోయేదిగా...

మొత్తానికి నేను కవరు ఇవ్వకుండా ఉండి ఉంటే, వాంతి పరిస్థితి ఎలా ఉండేదో ఇచ్చాక కూడా అలాగే జరిగినందుకి ఏమనాలో నాకు అర్థం అవటం లేదు..

No comments:

Related Posts with Thumbnails